AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Radhika Yadav: రీల్స్‌ కారణం కాదట.. రాధికాయాదవ్‌ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్‌! అటాప్సీ రిపోర్టులో వెల్లడి

టెన్నిస్‌ ప్లేయర్‌ రాధికా యాదవ్‌ను సొంత తండ్రి దీపక్‌ యాదవ్‌ చేతిలో హత్యకు గురైన సంఘటన యావత్‌ దేశాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురి చేసింది. ఈ కేసులో కూతురు రీల్స్ చేయడం వల్లనే దీపక్‌ యాదవ్‌ హత్య చేశాడని అందరూ అనుకున్నారు. కానీ అసలు సంగతి వేరే ఉందని తాజాగా విడుదలైన పోస్టుమార్టం నివేదికలో తెలిసింది. అసలేం జరిగిందంటే..

Radhika Yadav: రీల్స్‌ కారణం కాదట.. రాధికాయాదవ్‌ హత్య కేసులో షాకింగ్ ట్విస్ట్‌! అటాప్సీ రిపోర్టులో వెల్లడి
Tennis Player Radhika Yadav Murder Case
Srilakshmi C
|

Updated on: Jul 12, 2025 | 11:06 AM

Share

గురుగ్రామ్‌లోని సెక్టార్‌ 57లోని నివాసంలో రాధికా యాదవ్‌ (25) గురువారం ఉదయం 10.30 గంటల సమయంలో తండ్రీ కూతుళ్ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపోధ్రిక్తుడైన దీపక్‌ కిచెన్‌లో వంట చేస్తున్న కూతురు రాధికపై వరుసగా నాలుగు రౌండ్ల కాల్పులు జరిపాడు. అందులో మూడు బుల్లెట్లు ఆమె దేహాన్ని చీల్చుకుంటూ వెళ్లాయి. దీంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలింది. తన బిడ్డను తానే హత్య చేసినట్లు ఆయన పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. దీంతో దీపక్‌ను అరెస్టు చేసిన గురుగ్రామ్ పోలీసులు.. ఎఫ్ఐఆర్‌ ఫైల్‌ చేసి, అందులో రాధిక యాదవ్ హత్యకు గల పలు ఆసక్తికర కారణాలు వెల్లడించారు. రాధికా యాదవ్‌ టెన్నిస్‌ అకాడమీని నడపడమే అసలు కారణంగా దీపక్‌ యాదవ్‌ పోలీసుల దర్యాప్తులో వెల్లడించాడు.

నిజానికి.. రాధిక యాదవ్ జాతీయ స్థాయి టెన్నిస్ క్రీడాకారిణి. ఆమె అనేక పతకాలు సైతం గెలుచుకుంది. ఆమె అంతర్జాతీయ స్థాయిలోనూ దేశం తరపున ప్రాతినిధ్యం వహించింది. మీడియా నివేదికల ప్రకారం, ఆమె డబుల్స్ టెన్నిస్ క్రీడాకారిణిలో అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్యలో 113వ ర్యాంక్‌ను కలిగి ఉంది. ITF డబుల్స్‌లో టాప్ 200లో ఉంది. గతంలో టెన్నిస్‌ ఆడుతున్న సమయంలో రాధిక భుజంకి గాయమైంది. దీంతో ఆమె టెన్నిస్‌కు దూరమైంది. ఆ తర్వాత పిల్లలకు శిక్షణ ఇచ్చేందుకు టెన్నిస్‌ అకాడమీ స్థాపించి, నడుపుతుంది. అయితే అందరూ కూతురు సంపాదనపై బతుకుతున్నావని ఆమె తండ్రి దీపక్‌ను ఎగతాళి చేయడం ప్రారంభించారు. దాంతో కూతరును టెన్నిస్‌ అకాడమీని మూసేయమని పలుమార్లు చెప్పాడు. అయినా ఆమె వినిపించుకోక పోవడంతో గురువారం మరోమారు ఈ విషయమై తండ్రీకూతుళ్ల మధ్య వాగ్వాదం జరిగింది. కూతురిపై కోపం తెచ్చుకున్న దీపక్‌.. తన లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ తీసుకువచ్చి 4 రౌండ్లు కాల్పులు జరిపాడు. హత్య జరిగిన సమయంలో ఇంట్లో రాధికతోపాటు తండ్రి దీపక్‌, తల్లి మంజు యాదవ్‌ ఉన్నారు. వారి కుమారుడు ధీరజ్‌ పని నిమిత్తం బయటకు వెళ్లాడు. తుపాకీ పేలిన శబ్దం విన్న దీపక్ సోదరుడు కుల్దీప్ యాదవ్, అతని కుమారుడు పియూష్‌ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వెళ్లి చూడగా రక్తం మడుగులో రాధిక, పక్కన టేబుబ్‌పై 32 బోర్ రివాల్వర్కనిపించింది. వెంటనే పియూష్‌.. రాధికను సెక్టార్-56లోని ఆసియా మారిన్హో ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షించి ఆప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. దీపక్ యాదవ్ సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేశారు.

వెలుగులోకి మరో కారణం..

రాధిక హత్యకు అకడమితోపాటు ఓ వ్యక్తితో ఉన్న లవ్‌ ఎఫైర్‌ అనే విషయం కూడా కారణమని మరో వార్త వినిపిస్తోంది. రాధిక.. జీషన్ అహ్మద్ అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్, వీడియో ఆల్బమ్‌లు చేశారు. రాధికతో కలిసి చేసిన ఓ పాట ఏడాది క్రితం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ పాటను తొలగించాలని దీపక్‌ కూతురిని ఎన్నిసార్లు అడిగిన ఆమె వినకపోవడంతో హత్య చేసి ఉంటాడని మరో కారణం వెలుగులోకి వచ్చింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.