16వ రోజ్‌గార్ మేళా.. 51 వేల మందికి ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 16వ రోజ్‌గార్ మేళాను ప్రారంభించారు. 51,000 మందికి పైగా ఉద్యోగ నియామక పత్రాలు అందించారు. రైల్వే, హోం, తపాలా, ఆరోగ్యం వంటి విభాగాలలో ఈ ఉద్యోగాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో ఈ మేళా జరిగింది. యువతకు ఉపాధి కల్పించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం.

ఉపాధికల్పనకు అమిత ప్రాధాన్యాన్ని ఇస్తామన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మాట నిలబెట్టుకుంటూ 16వ రోజ్‌గార్ మేళాను నిర్వహించారు. యువతకు బతుకుదెరువును చూపించి వారికి సాధికారతను కల్పించడంతో పాటు, దేశ నిర్మాణంలో యువత పాలుపంచుకొనేందుకు చక్కని అవకాశాలను ఇవ్వడంలో రోజ్‌గార్ మేళాముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా నిర్వహిస్తూ వచ్చిన రోజ్‌గార్ మేళాలలో 10 లక్షలకు పైగా నియామక పత్రాలను అందజేశారు.
16వ రోజ్‌గార్ మేళాను దేశవ్యాప్తంగా 47 చోట్ల నిర్వహించనున్నారు. కేంద్ర ప్రభుత్వంలో వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ఈ ఉద్యోగ భర్తీ ఉంటుంది. కొత్తగా ఉద్యోగాల్లో నియామక ప్రక్రియ పూర్తి అయిన వారు రైల్వే శాఖ, హోం శాఖ, తపాలా విభాగం, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, ఆర్థిక సేవల విభాగం, కార్మిక, ఉపాధికల్పన శాఖలతో పాటు ఇతర మంత్రిత్వ శాఖల్లోనూ, విభాగాల్లోనూ చేరనున్నారు.
ఒకే రోజు 51 వేల మందికి నియామక పత్రాలు
ప్రభుత్వంలో వివిధ విభాగాలు, సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికైన 51,000 కు పైగా యువతీయువకులకు ప్రధాని మోదీ నియామక పత్రాలు అందించారు. ఉదయం 11 గంటలకు వర్చువల్ గా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉద్యోగాలకు ఎంపికైన యువతి, యువకులను ఉద్దేశించి మోడీ ప్రసంగించారు.
The Rozgar Mela reflects our Government’s commitment to empowering the Yuva Shakti and making them catalysts in building a Viksit Bharat. https://t.co/2k3WDTVnJc
— Narendra Modi (@narendramodi) July 12, 2025
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




