Tauktae Cyclone: కేరళను అతలాకుతలం చేస్తోన్న తౌతే తుపాను.. ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించిన వాతావరణ శాఖ..
Tauktae Cyclone: ఓవైపు కరోనాతో దేశం అతలాకుతలం అవుతోన్న వేళ.. ఇప్పుడు తౌతే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్రస్తుతం కేరళను షేక్ చేస్తోంది. అతి భారీ వర్షాలకు తోడుగా...
Tauktae Cyclone: ఓవైపు కరోనాతో దేశం అతలాకుతలం అవుతోన్న వేళ.. ఇప్పుడు తౌతే తుపాను ముంచుకొస్తుంది. ఈ తుపాను ప్రస్తుతం కేరళను షేక్ చేస్తోంది. అతి భారీ వర్షాలకు తోడుగా అత్యంత వేగంతో వీస్తున్న ఈదురు గాలులు అతలాకుతలం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ఇప్పటికే ‘రెడ్ అలెర్ట్’ ప్రకటించింది. తీర ప్రాంతాల్లో జనజీవనం పూర్తిగా స్థంభించిపోయింది. కేరళలోని మల్లాపురం, కోజికోడ్, వయనాడ్, పాలక్కాడ్‌తో పాటు పలు జిల్లాల్లో తుపాను ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. భారీ వర్షాల కారణంగా వందలాది ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇక తీరప్రాంతాల్లో సముద్రం ముందుకొచ్చింది. కొన్ని నదుల్లో నీటి మట్టం పెరగడంతో ఆనకట్టల గేట్లను ఎత్తివేశారు. ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చిన తౌతే తుపాను గుజరాత్ వైపు పయనిస్తున్నట్లు వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం 2.30 నుంచి రాత్రి 8.30 గంటల మధ్య గుజరాత్‌లోని పోర్‌బందర్-నలియాల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఆ సమయంలో గంటలకు 150 నుంచి 175 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read: ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన బౌలర్..! ఒకసారి కాదు రెండుసార్లు సాధించాడు.. ఎవరో తెలుసా..?
Hero MotoCorp: మే 17 నుంచి హీరో బైకుల ఉత్పత్తి.. మూసివేసిన ప్లాంట్లు దశల వారిగా ప్రారంభం