AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamilnadu: మరీ ఇలా ఉన్నారేంటి సామి.. భార్యకు భరణం ఇచ్చేందుకు నాణేల సంచులతో భర్త.. జడ్జి సహా అందరూ షాక్

ఇప్పటి వరకూ సోషల్ మీడియాలో చిల్లర పోగు చేసి బైక్ కొనుకునే వ్యక్తీ, ఐ ఫోన్ ని చిల్లరతో కొనుక్కున యువకుడు వంటి వింత వార్తల ను మాత్రమే కాదు.. విడాకుల సమయంలో భర్త నుంచి భార్య డిమాండ్ చేస్తున్న భరణానికి సంబంధించిన వార్తలు తరచుగా వింటూనే ఉన్నాం.. తాజాగా భరణం కోరిన భార్యకు భర్త ఇచ్చిన షాక్ కు కోర్టు ఆవరణలో సభ్యులతో పాటు జడ్జి కూడా షాక్ తిన్నారు. ఎందుక్నతే భార్యకు భరణంగా ఇవ్వాల్సిన డబ్బులను భర్త 20 సంచులను ఫ్యామిలీ కోర్టుకు తీసుకొచ్చాడు. ఈ ఘటన తమిళనాడులోని కోయంబత్తూరు ఫ్యామిలీ కోర్టులో చోటు చేసుకుంది.

Tamilnadu: మరీ ఇలా ఉన్నారేంటి సామి.. భార్యకు భరణం ఇచ్చేందుకు నాణేల సంచులతో భర్త.. జడ్జి సహా అందరూ షాక్
Interim Maintenance
Surya Kala
|

Updated on: Dec 20, 2024 | 4:45 PM

Share

ఓ భర్త తన భార్యకు భరణంగా 20 సంచులను తీసుకుని కోర్టుకు తీసుకురావడం కలకలం రేపింది. 20 బ్యాగుల్లో 80 వేల రూపాయల చిల్లర తీసుకురాగా.. వాటిని నోట్లగా మార్చి తీసుకురావాలని జడ్జి సూచించారు. ఈ వింత ఘటన తమిళనాడు కోయంబత్తూరులోని ఫ్యామిలీ కోర్టులో చోటు చేసుకుంది. వాడవల్లి ప్రాంతానికి చెందిన ఓ జంట కుటుంబ సమస్యల కారణంగా విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో వారు కోయంబత్తూరు కుటుంబ సంక్షేమ కోర్టులో విడాకుల కోసం పిటిషన్‌ వేశారు. చాలా కాలంగా విచారణ సాగుతోంది.

భార్యకు భరణం చెల్లించిన భర్త

విచారణ ముగియడంతో బాధితుడి భార్యకు రూ.2 లక్షల భరణం ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. మొదటి వాయిదాగా రూ.80000 చెల్లించాలని భర్త కోర్టుకు వచ్చాడు. విడాకులు తీసుకున్న భార్యకు చెల్లించాల్సిన రూ.80,000 భరణాన్ని ఒక రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయల నాణేలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. దీంతో రూ.80 వేల విలువైన నాణేలను 20 బ్యాగ్స్ లో పెట్టాడు. ఆ బ్యాగ్స్ అన్నిటిని తన కారులో పెట్టుకుని కోర్టుకు తీసుకుని వచ్చాడు. భార్యకు భరణంగా ఇవ్వమంటూ ఆ 20 సంచులను కోర్టు అందజేశాడు. చిల్లర నాణేలను చూసి కోర్టు సిబ్బంది ఉలిక్కిపడ్డారు.

అదే సమయంలో భర్త ఇచ్చే మెయింటెనెన్స్ కోసం ఎదురుచూస్తున్నా అతని భార్య కూడా షాక్ కు గురైంది. ఇది చూసిన న్యాయమూర్తి.. ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ చిల్లరను తీసుకుని వెళ్లి.. డబ్బులను నోట్ల రూపంలో తీసుకుని రమ్మన మని ఆదేశించారు. దీంతో ఆ భర్త చేసేది ఏమీ లేక తాను తెచ్చిన నాణేల సంచులను తీసుకుని మళ్లీ కారులో తిరిగి వెళ్ళాడు. రూ.500 నోట్లగా మార్చి రూ.80 వేలు నగదును విడాకులు తీసుకున్న భార్యకు భరణంగా ఇచ్చాడని సమాచారం.

ఇవి కూడా చదవండి

అయితే ఇలా భర్త తన భార్యకు భరణం తెచ్చిను చిల్ల నాణేలు అది కూడా కోర్టుకు తీసుకురావడం కలకలం రేపింది. భరణం అనేది విడాకుల తర్వాత ఆర్థిక మద్దతు కోసం ఒక జీవిత భాగస్వామి మరొకరికి చెల్లించాల్సిన పరిహారం. అందుకే విడాకుల కోసం దావా వేసే స్త్రీలు తమ భర్తలను భరణం అడగడం పరిపాటి. చాలా మంది మహిళలు తమ పిల్లలను పోషించడానికి, తమని తాము చూసుకోవడం కోసం భరణాన్ని కోరతారు. అలాగే విడాకులు తీసుకున్న మహిళలు పిల్లల అవసరాలను తీర్చడానికి వారి భర్తల నుంచి అధిక మొత్తంలో భరణాన్ని నెలవారీ మొత్తంగా పొందుతున్నారని గుర్తించారు. Source

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..