AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bag Polictics: బ్యాగ్ పాలిటిక్స్ కంటిన్యూ.. సిక్కు ఊచకోతని గుర్తు చేసే 1984 బ్యాగ్ ని ప్రియాంకకు గిఫ్ట్ గా ఇచ్చిన బిజేపీ ఎంపీ

పార్లమెంట్ లో తొలిసారిగా అడుగు పెట్టి కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా శీతాకాల సమావేశాల్లో పాల్గొనే సమయంలో తీసుకుని వెళ్తున్న బ్యాగ్ తో సరికొత్త రాజకీయానికి తెర తీసింది. ఒక సారి పాలస్తీనా అని రాసి ఉన్న బ్యాగ్ ను ధరించగా.. మరొకసారి బంగ్లాదేశ్ అని రాశి ఉన్న బ్యాగ్ ను ధరించారు. అయితే ఈ బ్యాగ్ రాజాకీయలకు కొనసాగింపుగా ప్రియాంక గాంధీకి బీజేపీ మహిళా ఎంపీ అపరాజిత సారంగి ఒక బ్యాగ్‌ని గిఫ్ట్ గా ఇచ్చారు. అయితే ఆ బ్యాగ్ పై 1984 అని రాసి ఉంది. బ్యాగ్ డిజైన్‌లో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను సూచించే విధంగా రక్తపు మరకలు చిమ్మి నట్లు ఉంది. ప్రియాంక గాంధీ బ్యాగ్ ద్వారా బిజేపీ ఎంపీ ఒక సందేశాన్ని పంపినట్లు అయింది.

Bag Polictics: బ్యాగ్ పాలిటిక్స్ కంటిన్యూ.. సిక్కు ఊచకోతని గుర్తు చేసే 1984 బ్యాగ్ ని ప్రియాంకకు గిఫ్ట్ గా ఇచ్చిన బిజేపీ ఎంపీ
Priyanka Bag Polictics
Surya Kala
|

Updated on: Dec 20, 2024 | 3:09 PM

Share

2024 లో చివరిగా జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు చరిత్రలో నమోదయ్యేలా ఉన్నాయి. ఈ సెషన్‌లో చేతులు దులుపుకోవడం, కొట్టుకోవడం నుంచి బ్యాగ్‌ రాజకీయాల వరకు ఎన్నో సంచలనాలు చోటు చేసుకున్నాయి. ప్రియాంక గాంధీ సరికొత్త ఆలోచనలతో పార్లమెంట్‌కు చేరుకుని ప‌లు వార్తల్లో నిలిచారు. ఒక్కోసారి పాలస్తీనా అని, మరికొన్ని సార్లు బంగ్లాదేశ్ అని రాసిన బ్యాగులు ప్రియాంకా వాద్రా చేతిలో కనిపించాయి. కాగా.. ఈ బ్యాగ్ రాజకీయాలను ఒరిస్సాకు చెందిన బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి కొనాసాగించారు. తాజాగా ప్రియాంక గాంధీకి ‘1984’ అని రాసి ఉన్న బ్యాగ్‌ని ఇచ్చి బీజేపీ తరపున బ్యాగ్ పాలిటిక్స్‌లోకి అడుగుపెట్టారు. ప్రియాంక బ్యాగ్ ద్వారా ఇస్తున్న మెసేజ్‌లకు స్పందించి ప్రత్యేకంగా ఈ బ్యాగ్‌ను సిద్ధం చేసినట్లు అపరాజిత చెప్పారు.

ప్రియాంక వాద్రాకు ‘1984’ సందేశాన్ని బ్యాగ్ తో ఇచ్చిన అపరాజిత

ప్రియాంక వాద్రాకు బీజేపీ మహిళా ఎంపీ అపరాజిత సారంగి ఇచ్చిన బ్యాగ్‌పై ‘1984’ అని రాసి ఉంది. బ్యాగ్ డిజైన్‌లో 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లను సూచిస్తూ అప్పుడు చిందిన నెత్తురి మరకలు గుర్తు తెచ్చేలా ఉన్నాయి. కాంగ్రెస్ తప్పిదాలను, ఆ కాలంలోని విషాదాన్ని గుర్తుచేస్తున్నట్లు అపరాజిత అభివర్ణించారు. ప్రియాంక గాంధీ బ్యాగ్ ద్వారా సందేశం పంపినట్లే తాను కూడా కాంగ్రెస్ చరిత్రను గుర్తుచేసే విధంగా ఆమెకు ఈ బ్యాగ్‌ను బహుమతిగా ఇచ్చానని తెలిపారు.

1984 సిక్కు అల్లర్లను గుర్తుచేసే బ్యాగ్

బ్యాగ్‌పై రక్తంతో పెయింట్ చేయబడిన ‘1984’ ఉంది. ఇది ఆ సంవత్సరంలో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లను గుర్తు చేస్తుంది. ఇందిరా గాంధీ హత్య తర్వాత ఢిల్లీలో ఈ అల్లర్లు చెలరేగాయి. వేలాది మంది సిక్కులు ప్రాణాలు కోల్పోయారు. ఇది కాంగ్రెస్ దౌర్జన్యాలకు ప్రతీకగా అభివర్ణించిన అపరాజిత.. కాంగ్రెస్ గతాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చేందుకే ఈ బ్యాగును అందజేశామన్నారు. విశేషమేమిటంటే.. ప్రియాంక గాంధీ ఈ బ్యాగ్‌ని తీసుకున్నారు. అయితే దీనిపై స్పందించలేదు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..