AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అడవిలో పాడుబడిన కారులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు లభ్యం

మధ్యప్రదేశ్‌లోని రాతీబార్‌లోని మెండోరా అడవిలో పాడుబడిన క్రెటా వాహనాన్ని అధికారులు గుర్తించారు. ఈ కారులో విలువైన బంగారు నగలు అధకారులకు దొరికాయి. ఈ నగలు విలువ సుమారుగా అంచనా వేసి అధికారుల కళ్ళు బైర్లు కమ్మాయి.. ఎందుకంటే ఈ నగల విలువ భారతీయ మార్కెట్‌లో సుమారు రూ. 2, 31,400,000గా అంచనా వేయబడింది.

అడవిలో పాడుబడిన కారులో 52 కిలోల బంగారం, రూ.10 కోట్ల నగదు లభ్యం
A Car Was Found In Forest
Surya Kala
|

Updated on: Dec 20, 2024 | 3:32 PM

Share

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో త్రిశూల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమాని, రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజేష్ శర్మకు చెందిన పలు ప్రాంతాల్లో ఆదాయపు పన్ను శాఖ దాడులు కొనసాగుతున్నాయి. వీరితో సంబంధం ఉన్న వ్యక్తులపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. రాజేష్ శర్మకు చెందిన 10 లాకర్ల గురించి దర్యాప్తు బృందానికి ఇప్పటివరకు సమాచారం అందింది. అంతేకాదు ఈ లాకర్లలో భారీ మొత్తంలో నగలు దొరికాయి.

భోపాల్, గ్వాలియర్, ఇండోర్‌లోని 52 ప్రాంతాల్లో ఆదాయ పన్ను శాఖ బృందం దాడులు చేసింది. భోపాల్‌లో 49, ఇండోర్‌లో 2, గ్వాలియర్‌లోని ఒక భవనంలో దాడులు జరిగాయి. ఈ సమయంలో రతీబాద్ ప్రాంతంలోని మెండోరా అడవిలో పాడుబడిన క్రెటా వాహనాన్ని బృందం కనుగొంది. అందులో రెండు బ్యాగుల్లో సుమారు 52 కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం నగల విలువ భారత మార్కెట్‌లో దాదాపు రూ.42 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ బంగారు నగలతో పాటు రూ.10 కోట్ల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.

త్రిశూల్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ ఆవరణపై దాడి

భోపాల్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు క్వాలిటీ గ్రూప్, ఇషాన్ గ్రూప్, రాజేష్ శర్మకు చెందిన త్రిశూల్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్‌ల ప్రాంగణాల్లో దాడులు జరిగాయి. అదే సమయంలో గ్వాలియర్‌లోని రామ్‌వీర్ సికర్వార్ ఇంటిపై దాడులు నిర్వహించారు. కొన్ని నెలల క్రితం రామ్‌వీర్‌ స్థలంపై కూడా ఈడీ దాడులు చేసింది. రామ్‌వీర్ ఆస్తి కొనుగోలు, అమ్మకాలను నిర్వహిస్తాడు. ఇతని వద్ద 5 ఎకరాల భూమి కొనుగోలుకు సంబంధించిన పత్రాలు కూడా లభించాయి. ఇంకా మరికొన్ని చోట్ల కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

ఇవి కూడా చదవండి

రాజేష్ శర్మకు చెందిన 10 లాకర్ల గురించి దర్యాప్తు బృందానికి ఇప్పటివరకు సమాచారం అందింది. అంతే కాకుండా భారీ మొత్తంలో నగలు దొరికాయి. ఈ నగల మూల్యాంకనం ఇంకా జరగాల్సి ఉంది. భోపాల్, ఇండోర్‌తో పాటు, ఈ కంపెనీలు జబల్‌పూర్, కట్నీ , రాయ్‌పూర్‌లకు చెందిన ప్రాంతాల్లో ఉన్నాయి. ఈ కంపెనీ పెట్టుబడి విషయంలో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ బడా మైనింగ్ వ్యాపారి పేరు కూడా వినిపిస్తోంది. ఇవి కాకుండా రూ.300 కోట్ల పెట్టుబడులు ఇతరుల నుంచి వచ్చినట్లు సమాచారం.

భోపాల్‌తో పాటు ఇండోర్‌, గ్వాలియర్‌లో కూడా భోపాల్‌, నీల్‌బాద్‌, ఎంపీ నగర్‌, కస్తూర్‌బా నగర్‌, హోషంగాబాద్‌ రోడ్‌, 10 నంబర్‌ మార్కెట్‌, మెండోరి, మెండోరా, ఆర్‌పిఎం టౌన్‌లో సోదాలు నిర్వహించారు. ఇండోర్‌లో కూడా త్రిశూల్ కన్‌స్ట్రక్షన్‌కు చెందిన ఆదిత్య గార్గ్‌పై దాడి జరిగింది. గ్వాలియర్‌లోని రాంవీర్ సికర్వార్ ఇంట్లో సోదాలు జరిగాయి.

గని కాంట్రాక్ట్ పని

సీఎం రైజ్‌ స్కూల్‌ కాంట్రాక్టును కూడా ఈ త్రిశూల్ కంపెనీ దక్కించుకుంది. మైనింగ్, నిర్మాణ వ్యాపారంతో సంబంధం ఉన్న రాజేష్ శర్మ మాజీ చీఫ్ సెక్రటరీకి సన్నిహితుడిగా పరిగణించబడుతున్నాడు. త్రిశూల్ కన్‌స్ట్రక్షన్ కంపెనీ యజమానిగానే కాకుండా.. రాజేష్ శర్మ భోపాల్‌లోని క్రషర్ ఆపరేటర్ల సంస్థకు కూడా నాయకత్వం వహిస్తున్నాడు. రాజధానితోపాటు పరిసర ప్రాంతాల్లో మైనింగ్ కాంట్రాక్టులు, క్రషర్ కార్యకలాపాలు కూడా చేస్తున్నాడు. రాజేష్ శర్మకు అధికార పార్టీకి చెందిన పలువురు నేతలతో స్నేహం ఉంది. దీంతో సీఎం రైజ్‌ స్కూల్స్‌ నిర్మాణ పనులు కూడా ఆయనకు వచ్చాయి. సీఎం రైజ్ స్కూల్ ఆఫ్ రైసన్‌ను త్రిశూల్ కన్‌స్ట్రక్షన్ గ్రూప్ నిర్మిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..