రాజీవ్ గాంధీ హత్య సరైనదే.. ఎల్‌టీటీఈ సానుభూతిపరుడి సంచలన వ్యాఖ్య!

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అంశం తమిళనాడులో మరోసారి దుమారం రేపింది. తాజాగా ఎల్‌టీటీఈ సానుభూతిపరుడు, నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అధినేత సీమాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాశం అయ్యాయి. శాంతి ఒప్పందం పేరిట భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వర్గానికి చెందిన వారిని హతమార్చిన రాజీవ్ గాంధీని తమిళ నేలలోనే మట్టుబెట్టామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు దారి తీశాయి. అటు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర […]

రాజీవ్ గాంధీ హత్య సరైనదే.. ఎల్‌టీటీఈ సానుభూతిపరుడి సంచలన వ్యాఖ్య!
Follow us

|

Updated on: Oct 15, 2019 | 1:18 PM

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య అంశం తమిళనాడులో మరోసారి దుమారం రేపింది. తాజాగా ఎల్‌టీటీఈ సానుభూతిపరుడు, నామ్‌ తమిళర్‌ కట్చి (ఎన్‌టీకే) అధినేత సీమాన్ తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద చర్చనీయాశం అయ్యాయి. శాంతి ఒప్పందం పేరిట భారత దళాలను శ్రీలంకకు పంపి తమ వర్గానికి చెందిన వారిని హతమార్చిన రాజీవ్ గాంధీని తమిళ నేలలోనే మట్టుబెట్టామంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనాలకు దారి తీశాయి. అటు ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ వర్గాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా చెన్నైలోని సీమాన్ ఇల్లు, ఎన్‌ఎంకే కార్యాలయాన్ని ముట్టడించారు. దీనితో సమాచారం అందుకున్న పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. సీమాన్‌పై దేశద్రోహం కింద కేసు నమోదు చేశారు.

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 1991 మే21వ తేదీని ఎల్‌టీటీఈ మానవబాంబు దాడిలో దారుణంగా హతమైన సంగతి తెలిసిందే. ప్రత్యేక తమిళ ఈలం కోసం శ్రీలంకలో జరుగుతున్న ఎల్‌టీటీఈ పోరు నేపథ్యంలో రాజీవ్ హత్యకు గురైన విషయం విదితమే. అప్పట్లో ఎల్‌టీటీఈ పోరుకు తమిళనాడులోని అనేక పార్టీలు మద్దతుగా నిలిచాయి. వాటిల్లో ఎన్‌టీకే కూడా ఒకటని చెప్పవచ్చు.