జీతాలివ్వడానికి డబ్బు లేదు.. 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన

జీతాలివ్వడానికి డబ్బు లేదు.. 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన

యోగీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జీతాలివ్వడానికి ఖజానా సరిపోదంటూ ఏకంగా 25 వేల మంది హోంగార్డుల ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. పోలీస్ స్టేషన్లలో, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉంటున్న వీరికి.. ఇక ఉద్యోగానికి సెలవు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. మరో 99 వేల మంది హోంగార్డులకు నెలలో సగం పనిదినాలనే (15 రోజులు) కల్పించబోతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వీరంతా ఇక సగం నెల జీతమే అందుకోనున్నారు. వాస్తవానికి వీరు పనిచేసిన రోజున […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Oct 15, 2019 | 4:06 PM

యోగీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. జీతాలివ్వడానికి ఖజానా సరిపోదంటూ ఏకంగా 25 వేల మంది హోంగార్డుల ఉద్యోగాలకు ఎసరుపెట్టింది. పోలీస్ స్టేషన్లలో, ట్రాఫిక్ కూడళ్ల వద్ద ఉంటున్న వీరికి.. ఇక ఉద్యోగానికి సెలవు అంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతేకాదు.. మరో 99 వేల మంది హోంగార్డులకు నెలలో సగం పనిదినాలనే (15 రోజులు) కల్పించబోతున్నట్లు స్పష్టం చేసింది. దీంతో వీరంతా ఇక సగం నెల జీతమే అందుకోనున్నారు. వాస్తవానికి వీరు పనిచేసిన రోజున డైలీ అలవెన్స్‌ కింద రూ.500 పొందేవారు. అయితే ఇటీవల సుప్రీంకోర్టు పోలీస్ కానిస్టేబుళ్లకు అందజేస్తున్నట్లుగానే హోంగార్డులకు కూడా డైలీ అలవెన్స్(డీఏ) అందజేయాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చింది. సుప్రీం కోర్టు తీర్పుతో ఆ మొత్తం రూ.672కు చేరింది. ఆ భారం పోలీస్ శాఖ బడ్జెట్‌పై పడుతోంది. దీంతో 25వేల మంది హోంగార్డులకు ఉద్వాసన పలికారు. వీరికి డైలీ అలవెన్సులు చెల్లిస్తే ప్రభుత్వ నిధికి భారీగా గండి పడుతుందని ఆ రాష్ట్ర డీజీపీ తెలిపారు.

కాగా, హోంగార్డులకు ఫిక్స్‌డ్ జీతం అంటూ లేదు. నెలకు 25 రోజుల పాటు పనిచేస్తే ఆ పని దినాలకు మాత్రమే డైలీ అలవెన్సు చెల్లించేవారు. ఇప్పుడు 99వేల మంది హోంగార్డుల పనిదినాలు 15 రోజులకు కుదించడంతో వారు సగం జీతమే అందుకోనున్నారు. యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్షాలు మండిపడుతున్నాయి. సీఎం యోగీ వ్యవహరిస్తున్న తీరుపై కాంగ్రెస్ నేత అజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు యువతకు ఉపాధి కల్పిస్తామని చెప్పి, ఇప్పుడు ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారన్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu