అకౌంట్లో రూ.90 లక్షలు.. బ్యాంక్ దివాలా తీయడంతో..

ఇంట్లో ఉంటే భయపడాల్సి వస్తుందని బ్యాంకుపై నమ్మకంతో తన దగ్గర ఉన్న సొమ్మును అందులో దాచుకున్నాడు. అదే ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. మహారాష్ట్రకు చెందిన సంజయ్ అనే ఓ చిరు వ్యాపారి.. పంజాబ్ అండ్ కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో రూ. 90 లక్షలు దాచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ బ్యాంకు దివాలా తీయడంతో గత కొద్ది రోజులుగా డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అతడికి తన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్ […]

అకౌంట్లో రూ.90 లక్షలు.. బ్యాంక్ దివాలా తీయడంతో..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By: Anil kumar poka

Updated on: Oct 15, 2019 | 5:17 PM

ఇంట్లో ఉంటే భయపడాల్సి వస్తుందని బ్యాంకుపై నమ్మకంతో తన దగ్గర ఉన్న సొమ్మును అందులో దాచుకున్నాడు. అదే ఆయన ప్రాణాలు పోయేలా చేసింది. మహారాష్ట్రకు చెందిన సంజయ్ అనే ఓ చిరు వ్యాపారి.. పంజాబ్ అండ్ కో ఆపరేటివ్ బ్యాంకు (పీఎంసీ)లో రూ. 90 లక్షలు దాచుకున్నాడు. అయితే ప్రస్తుతం ఆ బ్యాంకు దివాలా తీయడంతో గత కొద్ది రోజులుగా డబ్బుల కోసం బ్యాంకు చుట్టూ తిరుగుతున్నా అతడికి తన అకౌంట్లో ఉన్న డబ్బులు ఇవ్వడానికి బ్యాంక్ వెనుకడుగు వేస్తూ వచ్చింది. ఇప్పటికే ఆ బ్యాంకునుంచి డబ్బులు తీసుకోవాడానికి కస్టమర్లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో పీఎంసీ కస్టమర్ అయిన సంజయ్ గులాటీ తన రూ.90 లక్షలు ఇక రానట్టేనన్న మనస్థాపానికి గురై గుండెపోటుతో మృతి చెందాడు. మరోవైపు వ్యాపారనిమిత్తం డబ్బుల అవసరం ఉందని.. బ్యాంకులో డబ్బులు ఇవ్వక పోవడంతో చాలాకాలంగా ఆందోళనతో కాలం గడుపుతున్నారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంతోనే గుండెపోటు వచ్చిందని.. సంజయ్ మృతికి పీఎంసీనే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కాగా, సంజయ్ నిన్న కోర్టు ఎదుట పీఎంసీ ఖాతాదారులు చేపట్టిన ఆందోళనలో పాల్గొన్నాడు.

ఇదిలా ఉంటే ఆర్బీఐ.. పీఎంసీ ఖాతాదారులకు ఉపశమనం కలిగించింది. ఇక పీఎంసీ బ్యాంకు నుంచి కస్టమర్లు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు తీసుకునే అవకాశం కల్పించింది.