చిద్దూ కథ కంచికేనా ?
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కథ కంచికేనా ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ.. ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు చిదంబరానికి అశనిపాతంలా తగిలాయి. ఆయనపై పలు అభియోగాలున్నందున అరెస్టు చేసి విచారణ జరుపుతామన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను ప్రత్యేక కోర్టు ఆమోదించింది. చిదంబరంను అరెస్టు చేయొచ్చని స్పెషల్ జడ్జి మంగళవారం ఆదేశాలిచ్చారు. […]
కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం కథ కంచికేనా ? పరిస్థితి చూస్తే అలాగే అనిపిస్తోంది. ఒక వైపు సిబిఐ, ఇంకో వైపు ఈడీ.. ఇలా వరుస కేసులతో చిదంబరాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే తాజాగా స్పెషల్ కోర్టు ఆదేశాలు చిదంబరానికి అశనిపాతంలా తగిలాయి. ఆయనపై పలు అభియోగాలున్నందున అరెస్టు చేసి విచారణ జరుపుతామన్న ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అభ్యర్థనను ప్రత్యేక కోర్టు ఆమోదించింది. చిదంబరంను అరెస్టు చేయొచ్చని స్పెషల్ జడ్జి మంగళవారం ఆదేశాలిచ్చారు.
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో నమోదైన కేసుల్లో సిబిఐ ఇప్పటికే చిదంబరంను అరెస్టు చేసి, రిమాండ్ కు పంపింది. పలు దఫాలుగా ఆయన్ను కస్టడీకి తీసుకుని ప్రశ్నించింది. గత కొంత కాలంగా జ్యూడిషియల్ రిమాండ్ లో వున్న చిదంబరం అరెస్టును ఈడీ రంగంలోకి దిగింది. ఈ మేరకు ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీన్ని విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి చిదంబరం అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో సిబిఐ నమోదు చేసిన కేసులో చిదంబరానికి బెయిల్ లభించినా.. ఆ వెంటనే ఈడీ అరెస్టు చేసేందుకు మార్గం సుగమం అయ్యింది.
ఒకవేళ సిబిఐ కేసుల్లో చిదంబరం బెయిల్ మీద బయటికొస్తే.. ఆ వెంటనే ఆయన్న కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు ఈడీ సిద్దమవుతోంది. లండన్ తోపాటు పలు యూరొప్ దేశాల్లో చిదంబరానికి, ఆయన వారసుడు కార్తీ చిదంబరానికి పెద్ద ఎత్తున ఆస్తులున్నట్లు ఈడీ ఆధారాలు సేకరించింది. యుకేలోని అతిపెద్ద రిసార్టు ఆధారాలను ప్రత్యేక కోర్టకు సమర్పించింది ఈడీ. సో.. చిదంబరం చుట్టూ ఉచ్చు పెద్ద ఎత్తున బిగుస్తుండడంతో ఆయన ఇక జైలు జీవితానికే పరిమితమయ్యే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒకవేళ బెయిల్ దొరికినా.. ఆయన్ను జీవితాంతం కేసులు వెంటాడే సంకేతాలు కూడా అంతే బలంగా వున్నాయి. సో.. పలు కాంగ్రెస్ ప్రభుత్వాల్లో కీలకంగా వ్యవహరించి, జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన చిదంబరం కథ ఇక కంచికేనా ? అంటే అవుననే అనాల్సి వస్తుంది.