AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tamil Nadu: తమిళనాడులో రాజకీయ సమరం.. పన్నీర్‌ సెల్వంపైకి వాటర్‌ బాటిళ్లు విసిరిన ఈపీఎస్‌ వర్గం

అన్నా డీఎంకే జనరల్‌ కౌన్సిల్‌ మీటింగ్‌ రచ్చ రచ్చగా మారింది. ఓపీఎస్‌పైకి ఈపీఎస్‌ వర్గీయులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. సమావేశాన్ని బాయ్‌కాట్‌ చేస్తున్నట్టు ప్రకటించి వెళ్లిపోయారు ఓపీఎస్‌.

Tamil Nadu: తమిళనాడులో రాజకీయ సమరం.. పన్నీర్‌ సెల్వంపైకి వాటర్‌ బాటిళ్లు విసిరిన ఈపీఎస్‌ వర్గం
O Panneerselvam
Sanjay Kasula
|

Updated on: Jun 23, 2022 | 8:32 PM

Share

అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు హైడ్రామా తర్వాత ఇవాళ జరిగిన అన్నా డీఎంకే సర్వసభ్య సమావేశంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. రెండాకుల పార్టీలో ఈపీఎస్‌, ఓపీస్‌ వర్గాల మధ్య తీవ్ర విభేదాలు భగ్గుమన్నాయి. ఈ సమావేశం నిర్వహించాలని పళని స్వామి వర్గం ప్లాన్‌ చేస్తే, దాన్ని అడ్డుకునేందుకు పన్నీర్‌ సెల్వం వర్గం చివరి వరకు ప్రయత్నించింది. మద్రాస్‌ హైకోర్టులో నిన్న అర్ధరాత్రి అత్యవసర పిటిషన్‌ దాఖలు చేసింది. మీటింగ్‌ను ఆపలేకపోయినా తనకు కావాల్సింది సాధించుకున్నారు పన్నీర్‌ సెల్వం. పార్టీ అధినేత ఎన్నిక జరగకుండా చూడాలన్న పన్నీర్‌ విజ్ఞప్తి అనుకూలంగా కోర్టు ఆదేశాలు వచ్చాయి.

చెన్నైలోని శ్రీవారు వెంకట చలపతి ప్యాలెస్‌లో అన్నా డీఎంకే కీలక సమావేశం జరిగింది. ఇప్పటి వరకు మాజీ సీఎంలు పళని స్వామి, పన్నీర్‌ సెల్వం పార్టీ కోఆర్డినేటర్లుగా సమాన హోదాలో ఉన్నారు. అయితే ఇద్దరు కాకుండా ఒకరి నాయకత్వంలోనే పార్టీ నడవాలన్న డిమాండ్‌ పార్టీ శ్రేణుల నుంచి కొంతకాలంగా వస్తోంది.

#WATCH | Tamil Nadu: Bottles hurled at AIADMK coordinator and former Deputy CM O Panneerselvam at the party’s General Council Meeting today. The meeting took place at Shrivaaru Venkatachalapathy Palace, Vanagaram in Chennai.

ఇవి కూడా చదవండి

He walked out halfway through the meeting. pic.twitter.com/lVb1AdvAGt

— ANI (@ANI) June 23, 2022

దాంతో పార్టీ పగ్గాలు చేజిక్కించుకునేందుకు పళని, పన్నీర్‌ ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. కానీ మెజారిటీ నాయకుల మద్దతు పళనికే ఉన్నట్టు ముందు నుంచీ తెలుస్తూనే ఉంది. అందుకే పన్నీర్‌ అడ్డుపుల్ల వేస్తూ వస్తున్నారు. ముందుగా ఊహించినట్టే ఇవాళ సమావేశంలో ఎక్కువ మంది పళని స్వామి వైపు మొగ్గు చూపారు. దీంతో పన్నీర్‌ సెల్వం తన మద్దతుదారులతో వాకౌట్‌ చేశారు.

సమావేశ వేదికపై పళని, పన్నీర్‌ ఒకరినొకరు కనీసం పలకరించుకోలేదు. ఏక నాయకత్వ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు పళని వర్గీయులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇది పన్నీర్‌కు, ఆయన వర్గీయులకు నచ్చలేదు. సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్టు పన్నీర్‌ అనుచరుడు మైక్‌లో ప్రకటించారు.

అనంతరం వేదిక దిగి వెళ్లబోతున్న పన్నీర్‌పైకి కింద నుంచి ఈపీఎస్‌ వర్గీయులు వాటర్‌ బాటిళ్లు విసిరారు. దీంతో పన్నీర్‌కు ఆయన అనుచరులు, సెక్యూరిటీ రక్షణగా నిలిచి బయటకు తీసుకెళ్లారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో మరోసారి జూలై 11న పార్టీ సమావేశం జ‌ర‌గ‌నుంది. అప్పుడు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే అవకాశం ఉంది.

జాతీయ వార్తల కోసం