Tamil Vs Sanskrit: వైద్య విద్యార్థులతో సంస్కృతంలో ప్రమాణం.. మెడికల్ కాలేజీ డీన్‌ నిర్ణయంపై స్టాలిన్‌ సర్కార్‌ సీరియస్‌..

కేంద్రం నోట హిందీ అనే మాట వినిపిస్తే మంట పుడుతుంది తమిళ పార్టీలకు. కేంద్రం, తమిళనాడు మధ్య హిందీ వార్‌కు సంస్కృతం యాడ్‌ అయింది.

Tamil Vs Sanskrit: వైద్య విద్యార్థులతో సంస్కృతంలో ప్రమాణం.. మెడికల్ కాలేజీ డీన్‌ నిర్ణయంపై స్టాలిన్‌ సర్కార్‌ సీరియస్‌..
Tamil
Follow us

|

Updated on: May 02, 2022 | 10:43 PM

మోదీ ప్రభుత్వం విద్యను కాషాయీకరణ చేస్తోందన్నది ప్రతిపక్షాల ఆరోపణ. తాజాగా తమిళనాడులో ఓ మెడికల్‌ కాలేజీ వ్యవహారం, కేంద్రంపై స్టాలిన్‌ సర్కారు ఆగ్రహానికి కారణమైంది. ప్రధాని మోదీ, షాలు తమపై హిందీని ప్రయోగించాలని చూస్తున్నారని తమిళ లీడర్స్‌ అసలే గుర్రుగా ఉంటే, మెడికల్‌ కాలేజీ ఎపిసోడ్‌ మరింత మంట పుట్టించింది. లేటెస్ట్‌ కాంట్రవర్సీకి మదురై గవర్నమెంట్‌ మెడికల్‌ కాలేజ్‌ వేదికైంది. కొత్త వైద్య విద్యార్థులతో సంస్కృతంలో మహర్షి చరక శపథం చేయించారు ఆ కాలేజ్‌ డీన్‌. మెడికల్‌ స్టూడెంట్స్‌తో ఇంగ్లిషులో హిప్పొక్రేటిక్‌ ఓత్‌ చేయించడం సంప్రదాయం. గ్రీక్‌ ఫిజీషియన్ హిప్పొక్రేట్స్‌ పేరు మీద ఆ ప్రతిజ్ఞ ఆనవాయితీగా వస్తోంది. చరక శపథం ఆయుర్వేద గ్రంథమైన చరక సంహితలో భాగం. విద్యార్థులతో మహర్షి చరక శపథం చేయిస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రులు వేదికపైనే ఉన్నారు.

డీన్‌ నిర్ణయంపై మంత్రులు అవాక్కయ్యారు. కొన్ని గంటల్లోనే ఆ డీన్‌ను తొలగించింది స్టాలిన్‌ ప్రభుత్వం. ఆయనను వెయిటింగ్‌ లిస్ట్‌లో పెట్టింది. సంస్కృతంలో ప్రమాణంపై విచారణకు ఆదేశించారు రాష్ట్ర ఆరోగ్య మంత్రి. స్టాలిన్‌ సర్కారు నిర్ణయంపై మండిపడుతున్నాయి హిందూ సంఘాలు. సంస్కృతంలో ప్రమాణం ఎందుకు చేయకూడదని ప్రశ్నిస్తున్నాయి.

మెడికల్‌ కాలేజీల్లో చరక శపథం చేయించాలని నేషనల్‌ మెడికల్‌ కమిషనే సూచించిందని అంటున్నారు. ఈ ఇష్యూపై స్పందించారు పీఎంకే లీడర్‌, మాజీ కేంద్ర మంత్రి అన్బుమని రామదాస్‌. ఎన్డీఏలో పీఎంకే భాగస్వామ్య పక్షం అయినప్పటికీ డీన్‌ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఆయన. సంస్కృత శపథం మరే కాలేజ్‌లో చేయకూడదని ఆదేశించింది తమిళనాడు ప్రభుత్వం. రాష్ట్రంలోని మెడికల్‌ కాలేజ్‌ల డీన్‌లు అందరూ నిబంధనలు పాటించాలని, హిప్పొక్రేటిక్‌ ఓత్‌ను మాత్రమే చేయించాలని స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి: KA Paul: జక్కాపూర్‌లో కేఏ పాల్‌పై దాడి.. సిరిసిల్ల వెళ్తుండగా అడ్డుకున్న టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు..

Imran Khan: సౌదీలో పాక్ ప్రధానికి వ్యతిరేకంగా నినాదాలు.. ఇమ్రాన్‌ఖాన్‌ అరెస్ట్‌కు రంగం సిద్ధం..