Summer: దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసిన కేంద్రం..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల(Temperature)తో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. తాగునీరు, అవసరమైన మందులు, అవసరమైన అన్ని పరికరాలు, ఆరోగ్య సౌకర్యాలపై సమీక్షించాలని సూచించింది...

Summer: దేశంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు.. రాష్ట్రాలకు పలు సూచనలు చేసిన కేంద్రం..
Summer
Follow us

|

Updated on: May 03, 2022 | 12:01 AM

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల(Temperature)తో పలు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. తాగునీరు, అవసరమైన మందులు, అవసరమైన అన్ని పరికరాలు, ఆరోగ్య సౌకర్యాలపై సమీక్షించాలని సూచించింది. శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో భారత వాతావరణ విభాగం (IMD) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహపాత్ర మాట్లాడుతూ.. మే 2 వరకు వాయువ్య, మధ్య భారతదేశంలో వేడిగాలులు కొనసాగుతాయని, ఆ తర్వాత తగ్గుతాయని తెలిపారు. ఏప్రిల్‌లో భారతదేశంలోని సగటు ఉష్ణోగ్రత 35.05 డిగ్రీలు ఉంటుందని.. ఇది 122 సంవత్సరాలలో నాల్గోవ అత్యధికమని చెప్పారు. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు, మధుమేహం(Daibaties)తో బాధపడుతున్న వారు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ఇబ్బంది పడే అవకాశం ఉంది. హైపర్ థైరాయిడిజం ఉన్నవారు వేసవి నెలల్లో అసౌకర్యానికి గురవుతారని రాజధానిలోని సికె బిర్లా హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసిన్ విభాగం డాక్టర్ రాజీవ్ గుప్తా తెలిపారు.

“హైపర్ థైరాయిడిజంలో అంతర్గత శరీర ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. దడ, చెమట, వేడిగా అనిపించడం వంటి కొన్ని సమస్యలు వస్తాయన్నారు. వేసవిలో ఇటువంటి వారికి అధిక పరిసర ఉష్ణోగ్రతలు ఈ సమస్యలను పెంచుతాయి. ఇప్పుడు గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి, ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఈ సమస్యలు ఉన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. హైపర్ థైరాయిడిజం ఉన్న వృద్ధులు ఉన్నట్లయితే, వారు తప్పనిసరిగా ఇంటి లోపలే ఉండాలి” అని డాక్టర్ గుప్తా చెప్పారు. సర్వోదయ హాస్పిటల్ & రీసెర్చ్ సెంటర్‌లోని సీనియర్ కన్సల్టెంట్, ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ మరియు & జనరల్ ఫిజిషియన్ డాక్టర్ సుమిత్ అగర్వాల్ మాట్లాడుతూ వేడితో జీవక్రియ రేటులో అసమతుల్యత ఏర్పడుతుందని అన్నారు.

“దీని అర్థం ఇది డయేరియా, హీట్‌స్ట్రోక్, జ్వరం, టైఫాయిడ్, జలుబు మరియు దగ్గు వంటి అనేక ఆరోగ్య సమస్యలను తీసుకువస్తుంది. సాధారణంగా ఇటువంటి పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వృద్ధులు ఇంట్లోనే ఉంటారు. కానీ వారు బయటకు వస్తే, వారు మరింత ఎక్కువగా ఉంటారు. చిన్నపిల్లలు గ్యాస్ట్రో-సంబంధిత సమస్యలను నివారించడానికి ఇంట్లో వండిన తాజా ఆహారాన్ని మాత్రమే తినేలా చూసుకోవాలి. సరిగ్గా హైడ్రేట్‌గా ఉండటానికి వారి నీటి తీసుకోవడం పెంచాలి. వారు రాత్రి భోజనం కోసం ఉదయం వండిన ఆహారాన్ని తినకూడదు. గ్యాస్ట్రోఎంటెరిటిస్‌తో బాధపడుతున్న చాలా మంది రోగులను మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. యువకులు ఎండలో ఉంటే తప్పనిసరిగా తల కప్పుకోవాలి లేదా టోపీ ధరించాలి. ”అని డాక్టర్ అగర్వాల్ సలహా ఇచ్చారు. అలాగే మంచాన పడిన వారు కూడా ఇబ్బుందులకు గురవుతారని తెలిపారు. “వారికి ద్రవం రూపంలోని ఆహారం ఇవ్వాలి.” అని డాక్టర్ అగర్వాల్ చెప్పారు. వృద్ధులు ఎయిర్ కండిషన్డ్ వాతావరణం నుంచి మరొక ప్రాంతానికి వెళ్తున్నందున తాము సురక్షితంగా ఉన్నామని అనుకోవచ్చు.

Read Also.. Turmeric Side Effects: పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని మీకు తెలుసా..? ఈ వ్యక్తులకు హానికరమే..!