Turmeric Side Effects: పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని మీకు తెలుసా..? ఈ వ్యక్తులకు హానికరమే..!

Turmeric Side Effects: పసుపును భారతీయ కూరలలో ఎంతో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రంగు, రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా అందాన్ని కూడా ..

Turmeric Side Effects: పసుపు వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయని మీకు తెలుసా..? ఈ వ్యక్తులకు హానికరమే..!
Turmeric Side Effects
Follow us
Subhash Goud

|

Updated on: May 02, 2022 | 7:48 PM

Turmeric Side Effects: పసుపును భారతీయ కూరలలో ఎంతో ఉపయోగిస్తారు. ఇది ఆహారం రంగు, రుచిని పెంచుతుంది. ఇది ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా అందాన్ని కూడా మెరుగుపరుస్తుంది. పసుపు (Turmeric)ను ఆయుర్వేదంలో ఔషధంగా ఉపయోగిస్తారు. పసుపులో యాంటీ బయోటిక్, కాల్షియం, ఐరన్, సోడియం, క్రిమినాశక, విటమిన్ సి, విటమిన్లు వంటి పోషకాలు కూడా ఉన్నాయి. పసుపులో కర్కుమిన్ కారణంగా సైడ్ ఎఫెక్ట్స్ (Side Effects) కూడా ఉంటుంది. కర్కుమిన్‌లో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మీకు హాని కలుగుతుంది. కొంత మంది వ్యక్తులు వంటల్లో పసుపును తక్కువగా వాడటం మంచిది. ఆరోగ్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం..

పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు:

చాలా మందికి శరీరంలో రాళ్లు తరచుగా వస్తుంటాయి. పసుపును తీసుకునే ముందు వైద్యుల సలహాలు తీసుకోవడం మంచిది. పసుపులో ఆక్సలేట్ ఉంటుంది. ఈ కారణంగా కాల్షియం శరీరంలో కరిగిపోవడానికి బదులుగా అలాగే ఉండిపోవడం ప్రారంభమవుతుంది. రాళ్ళు ఏర్పడటానికి ఇది ఒక ముఖ్యమైన కారణం అవుతుంది. అందువల్ల పసుపు తీసుకోవడం వల్ల రాళ్ల సమస్య పెరుగుతుంది.

అతిసారం:

పసుపులో కర్కుమిన్ అనే మూలకం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను కలిగిస్తుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల విరేచనాలు, వాంతులు వచ్చే అవకాశాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పసుపు వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నా.. పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవడం మంచిదంటున్నారు.

ముక్కు నుండి రక్తం కారడం:

చాలా మంది ముక్కులో రక్తస్రావం అవుతుందని చెబుతుంటారు. వేడి కారణంగా ఇది జరుగుతుంది. పసుపులో వేడి లక్షణాలు ఉండటం వల్ల పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోవాలి. దీని అధిక వినియోగం ఈ సమస్యను మరింత పెంచుతుంది.

కామెర్లు:

కామెర్లు ఉన్నవారు లేదా పసుపు ఉందని చెప్పేవారు పసుపు తినడం మంచిది కాదు. దీన్ని తీసుకోవడం వల్ల ఈ సమస్య మరింత తీవ్రమవుతుంది. కామెర్లు ఉన్న రోగి వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే పసుపును తీసుకోవాలి. అయితే వంటల్లో తక్కువగా వేసుకోవడం బెటర్‌.

ఐరన్‌ లోపము:

శరీరంలో ఐరన్ లోపించడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. పసుపును ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఐరన్ సరిగా అందదు. అందువల్ల మీకు ఇప్పటికే ఐరన్‌ లోపం ఉంటే దానిని పరిమిత పరిమాణంలో తీసుకోవడం బెటర్‌.

మధుమేహం ఉన్నవారికి..

మధుమేహంతో బాధపడేవారు ఆహారం విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలి. అటువంటి పరిస్థితిలో డయాబెటిక్ పేషెంట్లు కూడా పసుపును అధికంగా తీసుకోవడం మానుకోవాలి. పసుపు వల్ల మంచి బెనిఫిట్స్‌ ఉన్నా.. కొందరు తక్కువగా తీసుకోవడం మంచిది.

(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి

Heat Stroke: హీట్‌స్ట్రోక్ శరీరంలో ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది.. లక్షణాలు ఏమిటి?

మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
మీ ఐఆర్‌సీటీసీ అకౌంట్ పాస్‌వర్డ్ మర్చిపోయారా?రీసెట్ చేసుకోవడం ఈజీ
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నితీశ్ కుమార్‌ రెడ్డికి ఏపీ ప్రభుత్వం భారీ నజరానా
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
నెలకు రూ.5 వేలు ఇన్వెస్ట్ చేస్తే చాలు.. లక్షాధికారి కావచ్చు..!
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
యూట్యూబ్‏ను షేక్ చేస్తోన్న గోదారి గట్టు సాంగ్..
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
ఆ బీమా పాలసీతో ఎంతో ధీమా.. కానీ ప్రధాన తేడాలు తెలుసుకోవాల్సిందే.!
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
నార్త్ టాప్‌‎ 1లో బన్నీ.. టాప్ 5లో ముగ్గరు సౌత్ కెప్టెన్లు..
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
రోల్స్ రాయిస్ ఈవీ కారు విడుదల.. మొదటి కారు కొనేసిన అంబానీ
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
కొడుకు కెరీర్ కోసం నితీశ్ రెడ్డి తండ్రి ఏం త్యాగం చేశాడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
రైతులకు శుభవార్త.. పీఎం కిసాన్‌ 19వ విడత వచ్చేది ఎప్పుడో తెలుసా?
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..
తెలుగబ్బాయ్ నితీష్ రెడ్డి ఆస్తులు, సంపాదన ఎంతో తెలుసా..