Heat Stroke: హీట్‌స్ట్రోక్ శరీరంలో ఏయే అవయవాలపై ప్రభావం చూపుతుంది.. లక్షణాలు ఏమిటి?
Heat Stroke: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిలో వాయువ్య భారతదేశం కొంకణ్ తీరం, మధ్య భారతదేశం, తెలంగాణ, ..
Heat Stroke: భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో వేడి గాలుల కారణంగా తీవ్రమైన ఉష్ణోగ్రతలు ఉంటాయి. వీటిలో వాయువ్య భారతదేశం కొంకణ్ తీరం, మధ్య భారతదేశం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ సీజన్‌లో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. అయితే వడగాలులు తీవ్రంగా ఉంటున్నాయి. ఈ రెండు నెలల్లో వానలు, ఉరుములతో కూడిన వర్షం, వడగళ్ల వర్షాలు కురిసిన దాఖలాలు లేకపోవడమే ఈ అధిక ఉష్ణోగ్రతలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఈనెలల్లో సగటు వర్షపాతం 30.4 మిల్లీ మీటర్లు ఉండగా, ఈ ఏడాది కేవలం 8.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దేశంలోని పశ్చిమ ప్రాంతం నుంచి వచ్చే గాలులు దక్షిణ, మధ్య భారతదేశ పవనాలను తాకినప్పుడు వర్షం, తుఫానులు వస్తాయి. ఈ సారి కూడా చాలా తక్కువే. సాధారణంగా వడగాలులు దశ ఏప్రిల్ చివరిలో ప్రారంభమై మే నెలలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. ఈ ఏడాది మార్చి 11 నుంచే హీట్ వేవ్ కనిపించింది.
హీట్ స్ట్రోక్ అంటే ఏమిటి?
హీట్ స్ట్రోక్.. దీనినే వడదెబ్బ కూడా అంటారు. వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం.. మీ శరీర ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ పెరిగినప్పుడు ఈ అత్యంత తీవ్రమైన వేడి, వడదెబ్బ (Heat stroke) సంభవించవచ్చు. వేసవి నెలల్లో ఈ పరిస్థితి సర్వసాధారణం అని చెబుతున్నారు. వడదెబ్బ రాగానే అత్యవసరంగా వైద్యం అందించాల్సిందే. లేకపోతే ప్రాణాలకే ముప్పు ఉండే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
శరీర ఉష్ణోగ్రతలు పెరగడానికి కారణం ఏమిటి?
వేసవి కాలంలో ఎండలు తీవ్రంగా ఉండటం కారణంగా శరీర ఉష్ణోగ్రత (40 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ) పెరగడం వల్ల హీట్ స్ట్రోక్ అనేది వస్తుంది. అధిక శరీర ఉష్ణోగ్రతను సకాలంలో నిరోధించకపోతే శాశ్వతంగా ముఖ్యమైన అవయవాలను దెబ్బతీస్తుంది. మెదడు లేదా మూత్రపిండాలు, మరణాలు కూడా సంభవించవచ్చు వైద్యులుహెచ్చరిస్తున్నారు. పిల్లలు (5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు), వృద్ధులు (65 ఏళ్లు పైబడినవారు), గర్భిణీ స్త్రీలు, ఊబకాయం ఉన్నవారు హీట్ స్ట్రోక్‌కి గురయ్యే ప్రమాదం ఎక్కవుగా ఉంటుందట. ఈ వేసవిలో వేడిగా ఉన్న ప్రాంతంలో ఎక్కువగా పని చేస్తున్నట్లయితే జాగ్రత్తగా ఉండాలి. దీని కారణంగా ఎండా వేడి కారణంగా స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
హీట్‌స్ట్రోక్ లక్షణాలు ఏమిటి?
హీట్ స్ట్రోక్ బారిన పడిన వారు అలసట, తలనొప్పి, తల తిరగడం, వికారం వంటివి సర్వసాధారణం. హీట్‌స్ట్రోక్ రాకముందే తరచుగా చెమటలు పట్టడం వంటివి ఉంటాయి. అలాగే నడవడంలో ఇబ్బంది, మూర్ఛలు లేదా స్పృహ కోల్పోవడం వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు వైద్యులు.
ఎలాంటి చర్యలు తీసుకోవాలి?
మీరు వడదెబ్బతో బాధపడుతుంటే నీడలోకి వెళ్లడం లేదా నీరు తాగడం వంటి సాధారణ శీతలీకరణ చర్యలు పని చేయవు. దీనిని నివారించడానికి ఉత్తమ మార్గం చల్లగా, హైడ్రేటెడ్‌గా ఉండటం. రోజులో అత్యంత వేడిగా ఉండే సమయంలో ఎండ నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. అది సాధ్యం కాకపోతే చల్లబర్చడానికి చిన్నపాటి విశ్రాంతి తీసుకోండని డాక్టర్ సలహా ఇస్తున్నారు. ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మంచిది. హీట్‌స్ట్రోక్‌కు గురైతే దుస్తులు తీసివేయాలి. రోగిని ఓపెన్ లేదా ఎయిర్ కండిషన్డ్ వాహనాల్లో తరలించాలి. రోగికి గోరువెచ్చని నీటితో స్ప్రే చేయడం, ఫ్యాన్‌లను ఉపయోగించడం కూడా చాలా మంచిది.
మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ఇవి కూడా చదవండి:
Health Tips: ఆ సమస్యలకు చెరుకు రసం దివ్య ఔషధం.. ఎలా తీసుకోవాలో తెలుసుకోండి..
Diabetes Control Tips: మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ పదార్థాలను పాలలో కలుపుకొని తాగాలి..!
(గమనిక: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏవైనా సందేహాలుంటే ముందుగా వైద్యులను సంప్రదించండి)