Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Diabetes Control Tips: మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ పదార్థాలను పాలలో కలుపుకొని తాగాలి..!

Diabetes Control Tips: మనిషికి వ్యాప్తి చెందే వ్యాధులలో మధుమేహం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం రోగులు పెరిగిపోతూనే ఉన్నారు. అయితే దాదాపు 90 శాతం మందికి తాము ..

Diabetes Control Tips: మధుమేహాన్ని నియంత్రించాలంటే ఈ పదార్థాలను పాలలో కలుపుకొని తాగాలి..!
Follow us
Subhash Goud

|

Updated on: May 01, 2022 | 10:58 AM

Diabetes Control Tips: మనిషికి వ్యాప్తి చెందే వ్యాధులలో మధుమేహం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా మధుమేహం రోగులు పెరిగిపోతూనే ఉన్నారు. అయితే దాదాపు 90 శాతం మందికి తాము ఎప్పటి నుంచి మధుమేహంతో బాధపడుతున్నామో తెలియదని పలు పరిశోధనల్లో వెల్లడైంది. ఒక దశకు వచ్చేసరికి శరీరంలో వస్తున్న తీవ్రమైన మార్పుల కారణంగా మధుమేహం లాంటి జబ్బు మనల్ని పట్టి పీడిస్తున్నాయి. మధుమేహం బారిన పడటం వెనుక ఆహారం, చెడు జీవనశైలి, జన్యుపరమైన కారణాలు ఉండవచ్చు అంటున్నారు పరిశోధకులు. ఇది శరీరాన్ని రెండు విధాలుగా ప్రభావితం చేస్తుంది. కొంతమందికి రక్తంలో చక్కెర స్థాయి (Blood sugar level control) ఉంటుంది. మరికొందరికి తగ్గుదల కూడా ఉండవచ్చు. చాలా సందర్భాలలో అధిక రక్త చక్కెర స్థాయి సమస్యను సృష్టిస్తుంది. మధుమేహం కారణంగా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తిలో సమస్య ఏర్పడుతుంది. అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన వంటి మార్పులు దీని లక్షణాలుగా పరిగణించబడతాయి.

సరైన ఆహార నియమాలు పాటించడం, జీవన శైలి కారణంగా మధుమేమాన్ని అదుపులో పెట్టుకోవడం తప్ప పూర్తిగా నియంత్రించలేము. ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడమే కాకుండా, కొన్ని ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవడం కూడా నియంత్రణలో ఉంచుకోవచ్చు. మధుమేహాన్ని నియంత్రించడానికి పాలకు సంబంధించిన ఈ ఆరోగ్య చిట్కాల గురించి తెలుసుకోండి.

దాల్చిన చెక్క పాలు

వంటగదిలో ఎప్పుడూ ఉండే దాల్చిన చెక్క ఆరోగ్యానికి మంచిదని భావిస్తారు. మసాలాగా, ఆహారం రుచిని పెంచే దాల్చిన చెక్కలో పొటాషియం, విటమిన్లు, కాల్షియం, ఐరన్, అనేక యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. పాలల్లో దాల్చిన చెక్క పొడిని రోజూ తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

పసుపు పాలు:

ఔషధ గుణాలున్న పసుపును పురాతన కాలం నుంచి ఔషధంగా ఉపయోగిస్తున్నారు. అనేక ఆరోగ్య ప్రయోజనాల కారణంగా, డయాబెటిక్ పేషెంట్లు దీన్ని ప్రతిరోజూ తినాలని సూచించారు. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బాక్టీరియల్, యాంటీ సెప్టిక్ గుణాలు ఎలాంటి వ్యాధినైనా తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీనితో పాటు, రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా ఇది ప్రభావవంతంగా పరిగణించబడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులే కాదు, ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నిద్రపోయే ముందు పసుపు పాలు తాగాలి.

బాదం పాలు:

బాదంపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు మన నుండి దూరంగా ఉండవచ్చు. ఇంకో విషయం ఏమిటంటే తక్కువ మొత్తంలో సోడియం కారణంగా, అధిక రక్తపోటు ఉన్న రోగులకు కూడా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. బాదం పాలు రోజూ తాగాలి. దీనితో పాటు 6 నుండి 7 నానబెట్టిన బాదంపప్పులను కూడా ఉదయాన్నే తినాలి.

(గమనిక: ఇందులోని అంశాలన్ని కేవలం అవగాహన కోసం మాత్రమే. వైద్య నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలుంటే వైద్యులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఇవి కూడా చదవండి:

Bed Tea Side Effects: నిద్ర లేవగానే ఖాళీ కడుపుతో టీ తాగుతున్నారా..? అయితే.. మీరు ప్రమాదంలో పడినట్లే..

Weight Loss: వ్యాయామం చేయకుండా 50 కిలోల బరువు తగ్గిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాకవ్వాల్సిందే..