Tamil Nadu: ఆ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు.. ఏడీఎంకే పై సీఎం స్టాలిన్ షాకింగ్ కామెంట్స్
తమిళనాడు (Tamil Nadu) అన్నాడీఎంకే లో నెలకొన్న అనిశ్చితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పరోక్షంగా స్పందించారు. ఆ విషయంలో తాను వెళ్లదలచుకోలేదని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని చెప్పారు. మనల్ని నాశనం...
తమిళనాడు (Tamil Nadu) అన్నాడీఎంకే లో నెలకొన్న అనిశ్చితిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిన్ పరోక్షంగా స్పందించారు. ఆ విషయంలో తాను వెళ్లదలచుకోలేదని, అందులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం కూడా తనకు లేదని చెప్పారు. మనల్ని నాశనం చేయాలనుకుని వారే పతనమవుతున్నారని ఘాటుగా అన్నారు. ఈ వ్యాఖ్యలు తమిళ రాజకీయాల్లో సంచలనంగా మారాయి(AIADMK). కేకేఎస్‌ఎస్‌ఆర్ రామచంద్రన్ ఎంజీఆర్, కరుణానిధి మంత్రివర్గాల్లోనూ ఉన్నారని, ప్రజాసేవలో అంకితభావానికి ఇదే నిదర్శనమని చెప్పారు. రామచంద్రన్ కుటుంబ సభ్యులతో తనకు ఉన్న అనుబంధాన్ని స్టాలిన్ గుర్తు చేసుకున్నారు. ఆ అనుబంధంతోనే తనకు ఆరోగ్యం సహకరించకున్నా పెళ్లికి హాజరైనట్లు వెల్లడించారు. కాగా.. చెన్నై నగరంలో జరుగుతున్న వరద నివారణ చర్యలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. చెన్నై, శివారు ప్రాంతాల్లో జరుగుతున్న వరద నివారణ చర్యల గురించి సమీక్షించారు. పనుల ప్రస్తుత పరిస్థితి గురించి తెలుసుకుని వాటిని సకాలంలో పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
తీవ్ర వాదోపవాదాలు, ఉత్కంఠ మధ్య తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి అన్నాడీఎంకేలో ఆధిపత్యం చాటుకున్నారు. దివంగత నేత, తమిళనాడు మాజీ సీఎం జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేలో ప్రధాన కార్యదర్శి పదవిని రద్దు చేశారు. దానికి పన్నీర్‌సెల్వం సమన్వయకర్తగా, పళనిస్వామి సంయుక్త సమన్వయకర్తగా కొనసాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇద్దరు తీసుకుంటున్న వేర్వేరు నిర్ణయాలతో సమస్య ఏర్పడింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..