Post Office Savings Scheme: నెలనెలా ఆదాయం రావాలనుకుంటే ఈ పోస్టాఫీస్ పథకంలో చేరండి.. రాబడి పక్కా..
చాలా మంది పొదువు చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఎందులో పొదువు చేయాలో వారికి తెలియదు. అయితే ట్రేడింగ్ పెట్టుబడి పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి.. అయితే వీటిలో రిస్క్ ఎక్కువగా ఉండడంతో ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తున్నారు...
చాలా మంది పొదువు చేయాలని నిర్ణయించుకుంటారు. కానీ ఎందులో పొదువు చేయాలో వారికి తెలియదు. అయితే ట్రేడింగ్ పెట్టుబడి పథకాల్లో మ్యూచువల్ ఫండ్స్ ఒకటి.. అయితే వీటిలో రిస్క్ ఎక్కువగా ఉండడంతో ఇందులో పెట్టుబడి పెట్టేందుకు ఆలోచిస్తున్నారు. ఇలాంటి వారికి పోస్టాఫీస్ పొదుపు పథకాలు మంచి ఎంపిక అవుతాయి. నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్‌కమ్ (MIS) పథకం ఒకటి. డబ్బును ఆదా చేసి, తమ రిస్క్ లేకుండా మంచి రాబడిని పొందాలని చూస్తున్న భారతీయుల కోసం ఇది మంచి ఎంపిక. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (PO-MIS)తో హామీతో కూడిన నెలవారీ ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబడిదారులు డిపాజిట్ చేసిన డబ్బు మార్కెట్ రిస్క్‌కు లోబడి ఉండదు. రిస్క్ లేకపోవడం వల్ల సంప్రదాయయ పెట్టుబడిదారుల్లో ఈ పథకం మంచి ప్రజాదరణ పొందింది. ఇది ప్రభుత్వ హామీ ఉన్న పథకం కాబట్టి, మెచ్యూరిటీ వరకు పెట్టుబడులకు ప్రృభుత్వ రక్షణ ఉంటుంది. సంప్రదాయ పెట్టుబడిదారులతో పాటు సీనియర్ సిటిజన్లకు ఈ పథకం సరిపోతుంది.
పోస్టాఫీసు MIS స్కీమ్ కింద ఒక సింగిల్ లేదా జాయింట్ ఖాతాను తెరవవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి ఒకే ఖాతాకు రూ.4.5 లక్షలు, ఉమ్మడి ఖాతాలకు రూ.9 లక్షలు ఉంది. ఒక వ్యక్తి MISలో గరిష్టంగా రూ. 4.5 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. జాయింట్ ఖాతాలో ఇద్దరు ఉంటే ఒక్కో వ్యక్తి గరిష్ఠంగా రూ.4.5 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం పోస్ట్ ఆఫీస్ MIS (POMIS) వార్షిక వడ్డీ రేటు 6.6 శాతం అందిస్తుంది. ఈ నెలవారీ ఆదాయ పథకం 5 సంవత్సరాల లాక్-ఇన్ వ్యవధితో వస్తుంది. పెట్టుబడి మెచ్యూర్ అయిన తర్వాత నిధులను ఉపసంహరించుకోవచ్చు. తిరిగి పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఇది ఆదాయ పన్ను పరిధిలోకి వస్తుంది. పోస్ట్ ఆఫీస్ MIS ఖాతాను తెరవడానికి, మీరు పోస్టాఫీసులో పొదుపు ఖాతాను కలిగి ఉండాలి. ఇంకా మీరు ఆధార్, ఓటర్ కార్డ్, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు, చిరునామా రుజువు వంటి గుర్తింపు రుజువుతో సహా ప్రాథమిక పత్రాలను అందించాలి. MIS ఖాతాను తెరవాలనుకునే ఆసక్తిగల పెట్టుబడిదారులు ఖాతా తెరవడానికి కనీస మొత్తం రూ. 1,000 అని గుర్తుంచుకోవాలి. పోస్ట్ ఆఫీస్ MIS ఖాతా నివాసి భారతీయులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న మైనర్‌ల కోసం కూడా POMIS ఖాతాలను తెరవవచ్చు. వారు 18 ఏళ్లు నిండిన తర్వాత ప్రయోజనాలను పొందగలుగుతారు.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి