LIC Jeevan Labh Policy: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే ప్లాన్.. రోజుకు రూ.253 చెల్లిస్తే చాలు రూ.54.50 లక్షలు మీ సొంతం..

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) పట్ల ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఈ ఇన్సూరెన్స్‌ సంస్థ ఎప్పటి నుంచో సేవలు అందిస్తుంది. ప్రభుత్వ మద్దతు గల ఈ కంపెనీ అనేక పాలసీలను తీసుకొచ్చింది...

LIC Jeevan Labh Policy: ఎల్‌ఐసీ నుంచి అదిరిపోయే ప్లాన్.. రోజుకు రూ.253 చెల్లిస్తే చాలు రూ.54.50 లక్షలు మీ సొంతం..
LIC
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 24, 2022 | 12:13 PM

లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(LIC) పట్ల ప్రజలకు నమ్మకం ఎక్కువ. ఈ ఇన్సూరెన్స్‌ సంస్థ ఎప్పటి నుంచో సేవలు అందిస్తుంది. ప్రభుత్వ మద్దతు గల ఈ కంపెనీ అనేక పాలసీలను తీసుకొచ్చింది. అలాంటి పాలసీల్లో ఎల్‌ఐసీ జీవన్‌ లాభ్‌ ఒకటి. ఈ పాలసీలో రోజుకు రూ.253 డిపాజిట్‌ చేయడం ద్వారా మొత్తం రూ.54.50 లక్షలు వరకు ప్రయోజనం పొందవచ్చు. ఎల్‌ఐసీ జీవన్‌ లాభ్‌ ప్లాన్‌ లాభం, రక్షణ రెండింటిని అందిస్తోంది. ఈ పాలసీ తీసుకోవాలంటే 8 నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న వారు తీసుకోవచ్చు. పాలసీ టర్మ్ 16 నుంచి 25 ఏళ్లు ఉంటుంది. కనీసం రూ.2 లక్షల మొత్తానికి పాలసీ తీసుకోవాలి. గరిష్ట పరిమితి అంటూ ఏదీ లేదు. మీకు రూ.54.50 లక్షలు రావాలంటే మీరు రోజుకు రూ. 253 చొప్పున 25 ఏళ్లపాటు మదుపు చేయాలి. మీరు 25 సంవత్సరాల వయస్సు ఉన్నట్లయితే, 25 సంవత్సరాల మెచ్యూరిటీ వ్యవధి కోసం LIC జీవన్ లాభ్ బీమాను కొనుగోలు చేసినట్లయితే మీరు మెచ్యూరిటీ సమయంలో అంటే 50 ఏళ్లకు రూ. 54.50 లక్షల వరకు పొందవచ్చు. LIC జీవన్ లాభ్ పాలసీ అనేక రకాల ప్రయోజనాలను కల్పిస్తోంది. బేసిక్ సమ్ అష్యూర్డ్, వెస్టెడ్ సింపుల్ రివర్షనరీ బోనస్‌లు, ఆఖరి అదనపు బోనస్‌లు పాలసీ మెచ్యూరిటీపై ఒకేసారి చెల్లిస్తారు. పాలసీదారు మరణించిన పక్షంలో నామినీకి బీమా హామీ మొత్తాన్ని అందజేస్తారు. ఇది సంపూర్ణ హామీ మొత్తం కంటే ఏడు రెట్లు ఎక్కువ.

ఈ పాలసీ తీసుకున్న వినియోగదారుడు మూడు సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లింపుపై కూడా రుణ సదుపాయం పొందవచ్చు. మెచ్యూరిటీ సమయంలో బీమా మొత్తం, బోనస్ వంటివి పొందవచ్చు. ప్రీమియంపై పన్ను మినహాయింపు లభిస్తుంది. పాలసీదారుడి మరణంపై కూడా పన్ను మినహాయింపు పొందవచ్చు. పాలసీ కొనసాగుతున్న సమయంలో గానీ, ఒక వేళ ప్రీమియంలు పూర్తిగా చెల్లించిన తర్వాత పాలసీదారుడు మరణించినా అతని నామినీ డెత్‌ సమ్‌ అస్యూర్డ్‌, సింపుల్‌ రివర్షనరీ బోనష్‌, డెత్‌ బెనిఫిట్స్‌ అదనంగా బోనస్‌ అందుకుంటారు. ఒక మాటలో చెప్పాలంటే పాలసీదారుడు మరణించినా అదనపు బీమా మొత్తం అందుతుంది. పిల్లల పెళ్లి, ఉన్నత చదువులు, ప్రాపర్టీ కొనుగోలు వంటి వాటికి ఈ పాలసీ అనుగుణంగా ఉంటుందని చెప్పుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిసినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్‌ చేయండి…

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!