AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

5G Spectrum Auction: వచ్చే నెలలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. సర్కార్‌ టార్గెట్‌ లక్ష కోట్ల రూపాయలు..

5జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే నెలలో జరగనుంది. దీని ద్వారా ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధిని సేకరించాలని భావిస్తోంది. ఈ వేలం ప్రక్రియలో 72 GHz స్పెక్ట్రమ్ చేర్చుతారు..

5G Spectrum Auction: వచ్చే నెలలోనే 5జీ స్పెక్ట్రమ్ వేలం.. సర్కార్‌ టార్గెట్‌ లక్ష కోట్ల రూపాయలు..
5g
Srinivas Chekkilla
|

Updated on: Jun 24, 2022 | 12:27 PM

Share

5జీ స్పెక్ట్రమ్ వేలం వచ్చే నెలలో జరగనుంది. దీని ద్వారా ప్రభుత్వం రూ.లక్ష కోట్ల నిధిని సేకరించాలని భావిస్తోంది. ఈ వేలం ప్రక్రియలో 72 GHz స్పెక్ట్రమ్ చేర్చుతారు. 20 సంవత్సరాల కాలానికి స్పెక్ట్రమ్‌ను వేలం వేయనున్నారు. అయితే, స్పెక్ట్రమ్‌లో ఎక్కువ భాగం విక్రయించరని IIFL సెక్యూరిటీస్ అభిప్రాయపడింది. IIFL ప్రకారం ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా కలిసి రూ. 71 వేల కోట్ల విలువైన స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేస్తాయని అంచనా వేస్తోంది. స్పెక్ట్రమ్ వేలం ( 5G వేలం ) వచ్చే నెల 26న ప్రారంభమవుతుందని విశ్వసనీయ సమాచారం. 5G స్పెక్ట్రమ్ వేగం 4G కంటే 10 రెట్లు ఉంటుంది. ఈ వేలం ప్రక్రియలో 600 MHz, 700 MHz, 800 MHz, 900 MHz, 1800 MHz, 2100 MHz, 2300 MHz తక్కువస్థాయి స్పెక్ట్రమ్‌లను వేలం వేస్తారు. మధ్యస్థాయిలో 3300 మెగాహెర్ట్జ్ వేలం వేస్తారు. అదే సమయంలో అధిక ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌లో 26000 MHz ఫ్రీక్వెన్సీ బ్యాండ్ వేలం వేస్తారు. CNBC నివేదిక ప్రకారం మధ్య శ్రేణి స్పెక్ట్రమ్‌ డిమాండ్ ఉంటుందని అంచనా.

టెలికాం కంపెనీలకు ఉపశమనం కలిగిస్తూ స్పెక్ట్రమ్ యూసేజ్ ఛార్జీని రద్దు చేయాలని ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. ఇప్పుడు టెలికాం కంపెనీలు ముందస్తు చెల్లింపులు చేయాల్సిన అవసరం లేదు. టెలికాం హార్డ్‌వేర్ కంపెనీ ఎరిక్సన్ నివేదిక ప్రకారం, 2027 వరకు వచ్చే ఐదేళ్లలో దేశంలోని 40% మంది సబ్‌స్క్రైబర్లు 5G నెట్‌వర్క్‌ను ఉపయోగించనున్నారు. ఇది కాకుండా మొబైల్ ట్రాఫిక్‌లో 56 శాతం 5G నెట్‌వర్క్ ద్వారా నిర్వహిస్తారు. స్పెక్ట్రమ్ వేలానికి ముందు ఫ్లోర్ రేట్ 3 శాతం తొలగించడం వల్ల టెలికాం కంపెనీలు వార్షిక ప్రాతిపదికన రూ.5400 కోట్లు ఆదా చేసుకోనున్నాయి. ఒక్క భారతీ ఎయిర్‌టెల్‌కు ఏటా 2100 కోట్లు ఆదా కానున్నాయి. Jio 2300 కోట్లు, Vodafone 1000 కోట్లు ఆదా కానున్నాయి. IIFL సెక్యూరిటీస్ నివేదిక ప్రకారం, ప్రభుత్వం 40 శాతం తగ్గించినప్పటికీ, 5G స్పెక్ట్రమ్ కోసం నిర్ణయించిన బేస్ ధర ఇప్పటికీ చాలా ఎక్కువగా ఉందని టెల్కోలు భావిస్తున్నాయి. వచ్చే నెల వేలంలో రిలయన్స్ జియో రూ.37500 కోట్లు వెచ్చించనుందని విశ్వసనీయ సమాచారం. ఎయిర్‌టెల్ 25 వేల కోట్లు, వొడాఫోన్ ఐడియా 850 కోట్లు వెచ్చించనున్నాయి. మొత్తంగా ఈ మొత్తం రూ.71 వేల కోట్లుగా IIFL అంచనా వేసింది.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి