Stock Market: లాభాల్లో స్టాక్ మార్కెట్లు.. రాణిస్తున్న బ్యాంక్, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్..
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:55 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 462 పాయింట్లు పెరిగి 52,712 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 148 పాయింట్ల పెరిగి 15,705 వద్ద ట్రేడవుతుంది.
స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. శుక్రవారం ఉదయం 9:55 గంటలకు బీఎస్‌ఈ సెన్సెక్స్ 462 పాయింట్లు పెరిగి 52,712 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 148 పాయింట్ల పెరిగి 15,705 వద్ద ట్రేడవుతుంది. గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూలతలు ర్యాలీకి కారణమయ్యాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 0.93 శాతం, నిఫ్టీ 1.26 శాతం పెరిగాయి. సబ్ ఇండెక్స్‌ల్లో నిఫ్టీ బ్యాంక్ 1.55, నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ 1.17 శాతం పెరిగియి. ఇండస్‌ఇండ్ బ్యాంక్ 3.10 శాతం పెరిగి రూ. రూ.809 వద్ద కొనసాగుతోంది. హిందూస్థాన్ యూనిలివర్, టాటా కన్సూమర్ ప్రొడక్ట్స్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ లాభాల్లో ఉన్నాయి.
30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో ఇండస్‌ఇండ్ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్, రిలయన్స్ ఇండస్ట్రీస్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా స్టీల్, ఎస్‌బీఐ, కోటక్ మహీంద్రా బ్యాంక్, డా. రెడ్డీస్, హెచ్‌డిఎఫ్‌సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ లాభాల్లో ఉన్నాయి. ఎల్‌ఐసీ షేర్లు 0.56 శాతం పెరిగి రూ. 668.60 వద్ద ట్రేడవుతున్నాయి. టెక్ మహీంద్రా, ఏసియన్ పెయింట్స్ నష్టాల్లో ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి