ISB Hyderabad: దేశంలో మొదటి స్థానంలో నిలిచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్.. ప్రపంచంలో 75వ ర్యాంక్..
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ద ఎకనామిస్ట్ 2022, ఫుల్‌టైమ్ ఎంబీఏ ర్యాంకింగ్ 2022 లో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆసియా దేశాల్లో 5వ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది ఐఎస్‌బీ...
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ హైదరాబాద్ ద ఎకనామిస్ట్ 2022, ఫుల్‌టైమ్ ఎంబీఏ ర్యాంకింగ్ 2022 లో దేశంలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో ఆసియా దేశాల్లో 5వ స్థానంలో, ప్రపంచ వ్యాప్తంగా 75వ స్థానంలో నిలిచింది ఐఎస్‌బీ. ఐఎస్‌బీ నిర్వహిస్తున్న పీజీపీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్) 2021 బ్యాచ్, 2022 బ్యాచ్ విద్యార్థులను సర్వే చేసి, ఈ ర్యాంకులను ‘ద ఎకనామిస్ట్’ నిర్ధారించింది. వినూత్న విద్యా విధానాలను అనుసరించడం ద్వారా ఈ ఘనత సాధించినట్లు ఐఎస్‌బీ డిప్యూటీ డీన్ ప్రొఫెసర్ రామభద్రన్ తిరుమలై తెలిపారు. ISB “ఓపెన్ న్యూ కెరీర్ అవకాశాలు” విభాగంలో ప్రపంచవ్యాప్తంగా ఐదవ స్థానంలో ఉంది. ఇందులో రిక్రూటర్‌ల వైవిధ్యం, గ్రాడ్యుయేషన్ ముగిసిన 3 నెలల తర్వాత జాబ్ ఆఫర్‌తో జాబ్-అన్వేషిస్తున్న గ్రాడ్యుయేట్ల శాతం, కెరీర్ సర్వీస్ పూర్వ విద్యార్థి రేటింగ్ ఉన్నాయి.
మే 27న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) స్నాతకోత్సవ వేడుకలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన బిజినెస్ స్కూల్ స్టూడెంట్స్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారతదేశం అంటే వ్యాపారమని.. ఈ విషయాన్ని ప్రపంచం గుర్తిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సంస్థ ఏర్పాటు కోసం అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 1990వ దశకంలో కృషి చేశారు.1998లో ఫార్చ్యూన్ టాప్ 500 కంపెనీల్లో కొన్ని సంయుక్తంగా కలిసి బిజినెస్ స్కూల్‌ను ప్రారంభించాలని నిర్ణయించాయి. అభివృద్ధి చెందుతున్న ఆసియా ఆర్థిక వ్యవస్థలకు అవసరమైన నాయకత్వ అవసరాలను తీర్చగలిగేలా ఆ సంస్థ ఉండాలని భావించాయి. దీంతో ఐఎస్‌బీని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడానికి ప్రయత్నించి సఫలికృతులయ్యారు.