Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Electric Car Fire: Tata Nexon EV కారులో మంటలు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. టాటా మోటర్స్ ఏం చెప్పిందంటే..

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లు, కాలష్యం కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యం ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ చాలా మంది కొన్నారు...

Electric Car Fire: Tata Nexon EV కారులో మంటలు.. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం.. టాటా మోటర్స్ ఏం చెప్పిందంటే..
Nexan Ev
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Jun 24, 2022 | 10:56 AM

పెరుగుతున్న పెట్రోల్, డీజిల్‌ రేట్లు, కాలష్యం కారణంగా చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాలపై వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యం ఎలక్ట్రిక్‌ టూవీలర్స్‌ చాలా మంది కొన్నారు. అయితే అవి పేలడంతో ఇప్పుడు కొనుగోళ్లు తగ్గించారు. అయితే ఈ పేలుళ్లపై విచారణ జరిపి, నివారణ చర్యలను సూచించేందుకు ఏర్పాటైన నిపుణుల కమిటీ ఈ నెలలో నివేదికను సమర్పించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ ప్రభుత్వ అధికారి గురువారం వెల్లడించారు. తాజాగా ఎలక్ట్రిక్‌ కారులో కూడా మంటలు చెలరేగడంతో ఎలక్ట్రిక్ వాహనాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం Tata Nexon EV లో అగ్నిప్రమాదం కేసులో, ప్రభుత్వం స్వతంత్ర దర్యాప్తునకు ఆదేశించింది. ఈవీ అగ్నిప్రమాదంపై ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది. తప్పు చేసిన కంపెనీలను శిక్షిస్తామని, నిపుణుల కమిటీ నివేదిక సమర్పించిన తర్వాత అన్ని లోపభూయిష్ట వాహనాలను రీకాల్ చేసేలా ఆదేశాలు ఇస్తామని రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఇటీవల చెప్పారు.

ఏప్రిల్‌లో పూణెలో ఓలా ఈ-స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అదే సమయంలో ప్రభుత్వ విచారణతో పాటు, టాటా మోటార్స్ కూడా నెక్సాన్ అగ్నిప్రమాదం కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. ఇప్పటి వరకు కేవలం ద్విచక్ర వాహనాల్లోనే ఎలక్ట్రిక్ వాహనాల్లో మంటలు చెలరేగుతున్నాయి. అయితే తొలిసారిగా ఓ పెద్ద వాహనంలో మంటలు చెలరేగాయి. ముంబైలో నెక్సాన్ ఎలక్ట్రిక్ వాహనం (ఈవీ)లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు ఆటోమేకర్ టాటా మోటార్స్ గురువారం తెలిపింది. టాటా మోటార్స్ ఒక ప్రకటనలో “ఇటీవలి వాహనం అగ్నిప్రమాదానికి సంబంధించిన సంఘటనకు సంబంధించిన వాస్తవాలను తెలుసుకోవడానికి మేము లోతైన విచారణను నిర్వహిస్తున్నాము. మా చర్య పూర్తయిన తర్వాత మాత్రమే మేము దీనికి సంబంధించిన వివరణాత్మక సమాచారాన్ని పంచుకుంటాము. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఎలక్ట్రిక్ వాహనం అగ్నిప్రమాదం వైరల్‌ అయిన నేపథ్యంలో కంపెనీ ఈ ప్రకటన విడుదల చేసింది. తమ వాహనాలు, వినియోగదారుల భద్రతకు కట్టుబడి ఉన్నామని కంపెనీ తెలిపింది. దాదాపు నాలుగేళ్లలో ఇదే తొలి ఘటన అని వాహన తయారీ సంస్థ తెలిపింది. ఇప్పటివరకు, ఈ కాలంలో 30,000 కంటే ఎక్కువ EVలు దేశవ్యాప్తంగా 100 మిలియన్ కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరాన్ని కవర్ చేశాయని గుర్తు చేశారు.

మరిన్ని బిజినెస్‌ వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి