తమిళనాడులో ఏపీ తరహా రాజకీయం పురుడుపోసుకుంటోందా..? జట్టు కట్టబోతున్న పార్టీలు ఏవీ?
తమిళనాడులో ఏపీ తరహా రాజకీయం పురుడుపోసుకుంటోందా..? ఆంధ్ర దేశపు తరహ కూటములు జట్టు కట్టబోతున్నాయా..? అధికార పార్టీని గద్దె దించేందుకు ఆ మూడు శక్తులు ఏకంకాబోతున్నాయా..? ఇసలు ద్రవిడ రాజకీయాల్లో ఆ మూడుపార్టీలు ఏకం కావడం సాధ్యమేనా..? త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల ముందు హాట్ టాపిక్‌గా మారింది.

తమిళనాడు రాజకీయాలంటే గుర్తుకు వచ్చేది రెండే రెండు పార్టీలు. అవి DMK, AIADMK. ఆరెండు పార్టీల అధిపత్యమే దశాబ్దాలుగా కొనసాగుతోంది. మరో పార్టీ పుట్టినా…దానికంత స్కోపు.. స్పేసు.. ఇవ్వడంలేదీ రెండు పార్టీలు. అంతలా తమిళుల నరనరాన ఇంకిపోయాయా రెండు పార్టీలు. అయితే 2026లో సరికొత్త రాజకీయం చోటు చేసుకోబోతోందన్న చర్చ తమిళనాడులో జోరుగా సాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో 2024 ఎన్నికల్లో TDP, BJP, జనసేన జట్టు కట్టి వైసీపీని ఓడించాయి. ఇప్పుడు తమిళనాడులో కూడా ఈతరహా కూటమికి రంగం సిద్ధమవుతోందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే AIADMK, BJP 2026 ఎన్నికల కోసం కూటమి కట్టాయి. అయితే హీరో విజయ్ పార్టీ టీవీకే కూడా తమ కూటమిలోకి రానుందని AIADMK నేతలు సంకేతాల ఇచ్చారు. ఎందుకంటే రెండు పార్టీలూ DMK అధికారాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో సాగుతున్నవే కాబట్టి జట్టు కట్టినా ఆశ్చర్యంలేదన్నది విశ్లేషకుల మాట.
అయితే ఏపీలో కూటమి విజయానికి సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషించాయి. తమిళనాడులోనూ సామాజిక సమీకరణలే కీరోల్ పోషిస్తాయి. వన్నియార్, తేవర్, ముక్కులతోర్, దళిత వర్గాలు రాజకీయంగా కీలకపాత్ర పోషిస్తున్నాయి. AIADMK తేవర్, ముక్కులతోర్ వర్గాల్లో బలంగా ఉంది. విజయ్ TVK పార్టీ యువ ఓటర్లు, దళిత వర్గాలను ఆకర్షిస్తోంది. BJP పట్టణ మధ్యతరగతి ఓట్లపై ఆధారపడుతోంది. ఈ మూడు పార్టీలు జట్టుకడితే సామాజిక వర్గాల ఓట్లను సమీకరించి DMK ఓటు బ్యాంకును చీల్చవచ్చు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో AIADMK, BJP విడివిడిగా పోటీ చేసిన 20 నియోజకవర్గాల్లో రెండు పార్టీల ఓటు షేర్ కలిపితే గణనీయమైన ప్రభావం చూపిస్తోంది. అయితే, TVK విజయ్ పార్టీ BJPపై వ్యతిరేకతతో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో జట్టు కట్టే అవకాశం ఉందా అన్న చర్చ కూడా వస్తోంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో AIADMK, BJP కూటమి 2026 ఎన్నికల కోసం బలమైన ప్రతిపక్ష పాత్ర పోషించడం ఖాయం. ఈశక్తి TVK తోడైతే DMKను సులభంగా ఓడించవచ్చని ఏఐడీఎంకే నేతలు భావిస్తున్నారు.
ఇప్పటికే బీజేపీ, ఏఐడీఎంకే నేతలు ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం కావాలని పిలపునిచ్చారు. అయితే DMK బలం సంక్షేమ పధకాలు. ప్రస్తుతం ఆపార్టీ మహిళలకు నెలవారీ ఆర్థిక సహాయం, ఉచిత బస్సు ప్రయాణం లాంటి పథకాలతో ప్రజల్లో బలంగా కనిపిస్తోంది. అయితే ఏపీలో వైసీపీపై వ్యతిరేకతతో కూటమి విజయం సాధించినట్లు, తమిళనాడులోనూ ప్రతిపక్ష ఓట్లను ఏకం చేసి విజయం సాధించాలని ఏఐడీఎంకే యోచిస్తోంది. కానీ ఇంతవరకు విజయ్ పార్టీ నుంచి అలాంటి సంకేతాలు అయితే రాలేదు. పైగా తమిళనాడులో డీఎంకేకు- టీవీకే పార్టీల మధ్యే పోటీ అని విజయ్ ఇదివరకే ప్రకటించారు. మరి ఈ పరిస్థితుల్లో కూటమి సాధ్యమా.. అన్న చర్చ జరుగుతోంది.
తమిళనాడులో ఏపీ తరహా కూటమి ఏర్పాటు అవకాశాలు ఉన్నా.. విజయం సామాజిక రాజకీయ డైనమిక్స్, పార్టీల సమన్వయంపై ఆధారపడి ఉంటుంది. AIADMK, BJP కూటమి ఖరారైనప్పటికీ, TVK చేరిక ఇంకా ప్రశ్నార్థకంగానే ఉంది. అయితే కూటమిగా ఎన్నికల్లో పోటీ చేస్తే.. DMK ఓడిపోయే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. ద్రవిడ పార్టీగా డీఎంకేపై ప్రజల్లో ఉన్న క్రేజు, అలాగే సంక్షేమ పథకాలు ఆపార్టీని మరోసారి అధికారంలోకి తెస్తాయన్న విశ్లేషణలూ వస్తున్నాయి. పైగా విజయ్ పార్టీ సింగిల్‌గానే రాణిస్తామన్న దీమాతో ఉంది. మరోవైపు AIADMK, BJP మధ్య గత ఎన్నికల నుంచి కొనసాగుతున్న విభేదాలు కూడా సవాళ్లుగా నిలుస్తాయి. మరి చూడాలి.. విభేదాలు పక్కనపెట్టి గెలుపుకోసం AIADMK, BJP పార్టీలు టీవీకేను తమవైపు తిప్పుకుంటాయా..లేదా అన్నది..!
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..