గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్న ట్రంప్.. అడుగంటిన అమెరికా ఆశలు..!
అమెరికాలో చదువుతున్న ప్రతి ఫారెన్ స్టూడెంట్‌కి ఇకపై చుక్కలు కనిపిస్తాయి. ఆల్రడీ లెక్కపెట్టిస్తున్నాడు ట్రంప్. అమెరికాకు చదువుకోడానికి వెళ్తున్నామని లగేజ్ సర్దుకున్న ఇండియన్ స్టూడెంట్స్.. పర్టిక్యులర్‌గా తెలుగు విద్యార్ధులు మరొక్కసారి ఆలోచించుకోవడం బెటర్. భయపెట్టడానికి చెప్పడం లేదీ మాట.

‘అమెరికాలో పార్ట్ టైమ్ జాబ్స్ ఎలా ఉంటాయి.. గంటకు ఎంతిస్తారు..?’. చదువుకోడానికి వెళ్లే ప్రతి ఒక్కరూ కామన్‌గా డిస్కస్ చేసే పాయింటే ఇది. మెయిల్స్‌లోనో, ఇన్‌స్టా, ఫేస్‌బుక్‌లో డిస్కస్ చేస్తుంటారు దీని గురించి. ఇదే.. విద్యార్ధుల కొంప ముంచబోతోంది. అక్కడికి వెళ్లి పార్ట్‌టైమ్ జాబ్ చేస్తారో చేయరో అనవసరం. సరే.. ఏ పార్ట్‌టైమ్ జాబూ చేయడం లేదనుకోండి. అయినా సరే.. వీసా రద్దు కావొచ్చు. ఆల్రడీ సోషల్ మీడియాలో ఈ టాపిక్ తెచ్చారు కదా. అది చాలు.. వీసా రద్దు చేసి ఇంటికి పంపడానికి. పార్ట్‌టైమ్ జాబ్ గురించి చిన్న డిస్కస్ కూడా పెట్టకూడదనేది రూల్. స్టూడెంట్ వీసాలో ఉంటుంది. కాకపోతే చదవరెవరూ. దాన్ని అడ్డం పెట్టుకుని ఇంటికి పంపించడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు ట్రంప్. అమెరికాలో ఇదే జరుగుతోందిప్పుడు. రెమిటెన్సెస్. అంటే, అమెరికాలో సంపాదించి భారత్‌లో ఉన్న తమ వారికి పంపించే డబ్బుకే రెమిటెన్సెస్ అని పేరు. ప్రపంచంలోని ప్రతి దేశం నుంచి వందలు.. వేలు.. లక్షల మంది అమెరికాలో ఉంటున్నారు. వాళ్లంతా తమ దేశాలకు డాలర్స్ పంపిస్తుంటారు. అలా అమెరికా నుంచి భారత్‌కు వస్తున్న రెమిటెన్సెస్ వాటా 28 శాతం. వరల్డ్‌లో మరే దేశస్థులు తమ కంట్రీకి ఇంత డబ్బు పంపించడం లేదు. ఇందాకో మాట అనుకున్నాం. అమెరికాలో చదువుకోడానికి డాక్యుమెంట్స్ అన్నీ పక్కాగా ఉన్నప్పుడు ఇక భయపడడమెందుకని. బట్.. వాళ్లని నిజం చెప్పమనండి. నిజంగా అమెరికా వెళ్లేది చదువుకోడానికా. అదే...
