AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral News: భవిష్యత్తులో రోజుకు 25 గంటలట…! కాల గడియారం మారబోతుంది

సాధారణంగా రోజులో ఎన్ని గంటలుంటాయ్‌ అంటే 24 అని టక్కున చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ లెక్క మారనుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, భవిష్యత్తులో ఈ లెక్క మారే అవకాశం ఉందని, రోజుకు మరో గంట అదనంగా చేరి 25 గంటలుగా...

Viral News: భవిష్యత్తులో రోజుకు 25 గంటలట...! కాల గడియారం మారబోతుంది
25 Hours Earth
K Sammaiah
|

Updated on: May 28, 2025 | 8:43 PM

Share

సాధారణంగా రోజులో ఎన్ని గంటలుంటాయ్‌ అంటే 24 అని టక్కున చెప్పేస్తాం. కానీ ఇకపై ఈ లెక్క మారనుందా అంటే అవుననే అంటున్నారు శాస్త్రవేత్తలు. అవును, భవిష్యత్తులో ఈ లెక్క మారే అవకాశం ఉందని, రోజుకు మరో గంట అదనంగా చేరి 25 గంటలుగా చెప్పుకోవాల్సి వస్తుందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. భూమి తన చుట్టూ తాను తిరిగే వేగం క్రమంగా మందగించడమే ఇందుకు కారణమని జర్మనీలోని మ్యూనిక్‌ టెక్నికల్‌ యూనివర్సిటీ, అమెరికాలోని విస్కాన్సిన్‌-మాడిసన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో వెల్లడించారు.

ఈ మార్పు ఎందుకు అంటే… భూమికి సహజ ఉపగ్రహమైన చంద్రుడు ప్రతి సంవత్సరం సుమారు 3.8 సెంటీమీటర్ల చొప్పున మన గ్రహం నుంచి దూరంగా జరుగుతున్నాడు. ఈ పరిణామం వల్ల భూమి, చంద్రుడికి మధ్య ఉన్న గురుత్వాకర్షణ బలాల్లో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. చంద్రుడి ప్రభావంతో సముద్రాల్లో ఏర్పడే ఆటుపోట్ల తీరు కూడా మారుతోంది. వీటికి వాతావరణ పరిస్థితులు కూడా తోడై భూభ్రమణ వేగం తగ్గుతోందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. భూమిలో దాదాపు 20 అడుగుల లోతులో అమర్చిన ప్రత్యేకమైన రింగ్‌ లేజర్‌ టెక్నాలజీ సహాయంతో ఈ సూక్ష్మమైన మార్పులను గుర్తించినట్లు వారు తెలిపారు.

అయితే, ఈ భూభ్రమణ వేగంలో మార్పులు రావడం, తద్వారా రోజులోని గంటల వ్యవధి మారడం అనేది ఇదే మొదటిసారి కాదని శాస్త్రవేత్తలు గుర్తుచేస్తున్నారు. సుమారు 140 కోట్ల సంవత్సరాల క్రితం చంద్రుడు భూమికి చాలా దగ్గరగా ఉన్నప్పుడు, భూభ్రమణం వేగంగా జరిగి రోజుకు కేవలం 18 గంటలు మాత్రమే ఉండేవని వారు వివరిస్తున్నారు. కాలక్రమేణా చంద్రుడు దూరమవుతున్న కొద్దీ, భూభ్రమణ వేగం తగ్గి, రోజు నిడివి పెరుగుతూ వస్తోంది.

రోజుకు 25 గంటలు అనే ఈ మార్పు తక్షణమే సంభవించేది కాదని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మార్పు రావడానికి సుమారు 20 కోట్ల సంవత్సరాలు పట్టవచ్చని అంచనా. అప్పటికి మానవ నాగరికత ఉంటే, క్యాలెండర్లలో తేదీల లెక్కింపు నుంచి మొదలుకొని, గ్లోబల్‌ పొజిషనింగ్‌ సిస్టమ్‌ (GPS) లోని అటామిక్‌ క్లాక్‌ల వరకు, విమానయాన సమయపాలన వంటి అనేక వ్యవస్థలలో కీలకమైన సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని వారు పేర్కొన్నారు.

Follow Us
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
కారం కోడిగుడ్డు వేపుడు.. వేడి అన్నంలో ఒక్కసారి తింటే వదిలిపెట్టరు
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
హైదరాబాద్ ప్రజలకు దసరా గిఫ్ట్.. ప్రభుత్వం నుంచి మరో శుభవార్త..?
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
తొలి మ్యాచ్‌కు సిద్ధమైన వైభవ్ సూర్యవంశీ.. ఉప్పల్‌లో డెబ్యూకు రెడీ
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
జురాసిక్ కాలం నాటి వుల్లీ మమ్మోత్‌లకు మళ్లీ ప్రాణం పోస్తున్న AI
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
బీపీ, షుగర్ అదుపులో ఉండాలంటే ఈ ఉప్మా తినండి చాలు..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
ఏపీలో నాణ్యమైన ఉల్లిపాయలు కిలో రూ.35కే..
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
పండగ సేల్స్‌లో ANC ఫీచర్‌తో వచ్చే టాప్-5 నెక్‌బ్యాండ్స్ ఇవే!
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
అనుభవం నుంచి నేర్చుకున్న పాఠం.. ఈసారి మహేష్ బాకీ తీర్చేస్తాడా?
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
రంగు నలుపు.. ఘాటు మాత్రం అదుర్స్..
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు
తొలి వెబ్ సిరీస్‌తోనే సెన్సేషన్ సృష్టించిన డైరెక్టర్ డేగల బాబు