Tamil Nadu Assembly Elections: తమిళనాట అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఈసీ కన్ను.. బిర్యానీ నిల్.. సాంబార్ అన్నం ఫుల్

సర్వ సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కనిపించేవి బిర్యానీ పేకెట్లు. ఈ వేడి వేడి బిర్యానీ పేకెట్లు అన్ని పార్టీకే కేడర్స్ ను ఏకం చేస్తుంది. ఇక రాష్ట్రంలో నామినేషన్లు దాఖలు చేసే సమయంలోను.. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం...

Tamil Nadu Assembly Elections: తమిళనాట అభ్యర్థుల ఎన్నికల ఖర్చుపై ఈసీ కన్ను..  బిర్యానీ నిల్.. సాంబార్ అన్నం ఫుల్
Tamil Nadu Election Campaig
Follow us
Surya Kala

|

Updated on: Mar 22, 2021 | 5:46 PM

Tamil Nadu Assembly Elections : సర్వ సాధారణంగా ఎన్నికల ప్రచారంలో ఎక్కువగా కనిపించేవి బిర్యానీ పేకెట్లు. ఈ వేడి వేడి బిర్యానీ పేకెట్లు అన్ని పార్టీకే కేడర్స్ ను ఏకం చేస్తుంది. ఇక రాష్ట్రంలో నామినేషన్లు దాఖలు చేసే సమయంలోను.. అభ్యర్థులు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోను బిర్యానీ దర్శనమిస్తుంది. ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఆయా పార్టీ కార్యకర్తలకు వేడి వేడి బిర్యానీని అందిస్తారు. కొన్ని సార్లు మద్యం బాటిల్స్ కూడా సందడి చేస్తాయి. అయితే తమిళనాడులోని అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పార్టీల నుంచి బిర్యానీ పేకెట్స్ ఆర్డర్స్ చాలా తక్కువగా ఉందని బిర్యానీ తయారీదారులు పేర్కొన్నారు. భారతదేశ ఎన్నికల కమిషన్ (ఇసి) ఆహార ఖర్చుతో సహా అభ్యర్థులు చేసిన ఖర్చుల లెక్కలను పక్కాగా సేకరిస్తున్నందున ఈ సీజన్ లో బిర్యానీ రుచిని కోల్పోయినట్లు తెలుస్తోంది.

నిజానికి ఎన్నికల ప్రచారం లో కార్యకర్తలకు “బిర్యానీ ఇచ్చే పద్ధతి 20 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. కార్యకర్తలకు అభ్యర్థులను పరిచయం చేయడానికి జరిగే సమావేశాలలో ఇది చాలా తరచుగా జరిగే కార్యక్రమం. ఐతే కొంతమంది ధనవంతులైన అభ్యర్థులు ప్రచార సమయంలో కూడా బిర్యానీ పేకెట్స్ ను పంపిణీ చేస్తారు. అయితే ఇప్పుడు తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సాంబార్ భోజనం మాత్రమే ఇస్తున్నారని 30 ఏళ్ళనుంచి రాజకీయాల్లో ఉన్న వెల్లూరు సిటీ కార్పొరేషన్ మాజీ కౌన్సిలర్ కె. శ్రీనివాస గాంధీ అన్నారు.

గత ఎన్నికలతో పోలిస్తే, ఈసారి బిర్యానీ పేకెట్స్ అమ్మకాలు చాలా తక్కువగా ఉన్నాయని.. తాము చాలా ఎన్నికలను దగ్గరగా చూశామని.. ఎన్నికలు జరిగే ప్రతి సారీ .. రోజుకు 300 నుండి 500 ప్యాకెట్ల బిర్యానీలను విక్రయించేవారమని పలు హోటల్స్ యజమానులు చెప్పారు. ఎన్నికల ప్రచారం మొదలు పెట్టిన రోజు నుంచి ఎన్నికలు ముగిసే వరకూ బిర్యానీకి డిమాండ్ ఉండేదని.. ఈ సంవత్సరం, మాకు రాజకీయ పార్టీల నుండి పెద్ద ఆర్డర్ ఒక్కటి కూడా రాలేదు. వ్యాపారం మందకొడిగా ఉందని అంబూర్ లోని స్టార్ బిర్యానీ మేనేజింగ్ డైరెక్టర్ ఎం. మునీర్ అహ్మద్ అన్నారు.

100 కి పైగా బిర్యానీ ప్యాకెట్లను ఎవరైనా ఆర్డర్ చేస్తే సమాచారం ఇవ్వమని ఎన్నికల అధికారులు వ్యాపారాలను కోరినట్లు వెల్లూరులోని మరో బిర్యానీ తయారీదారుడు చెప్పారు. దీంతో ఎన్నికల వ్యయానికి ఇది కూడా ఎక్కడ కలుపుతారో అని భయపడిన అభ్యర్థులు బిర్యానీ ప్యాకెట్లను ఆర్డర్ చేయడంలేదని.. కార్యకర్తలు తమకు నచ్చిన ఆహారం తినమని డబ్బు ఇస్తున్నారని ఒక కేటరింగ్ చేస్తున్న ఒక వ్యక్తి చెప్పారు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద చిన్న పార్టీల నుంచి రోజుకి 800 నుండి 1,000 చికెన్ బిర్యానీ ప్యాకెట్ల ఆర్డర్ వచ్చాయని.. ఈ సారి డిఎంకె , ఎఐఎడిఎంకె సహా ఎవరూ ఒక్క ఆర్డర్ కూడా ఇవ్వలేదని తిరువల్లూరు జిల్లాలోని అరంబక్కంకు చెందిన వ్యాపారి ఎన్ఎస్ఆర్ నిజాముద్దీన్ చెప్పారు. ఇక దిండిగల్‌లోని చెన్నినికెన్‌పట్టి జంక్షన్‌లో గోల్డ్ స్టార్ బిర్యానీని పాయింట్ యజమాని వి.ఎస్.వేనుగోపాల్, తాను గత 27 సంవత్సరాలుగా ఈ స్టాల్ ను నడుపుతున్నానని .. తాము ఎప్పుడూ బిర్యానీ ప్యాకెట్లను సరఫరా చేయలేదుని ..అయితే ప్రచారం తరువాత, భోజనం లేదా విందు కోసం ఇక్కడికి తీసుకువచ్చేవారు. ఇలా ఎన్నికల ప్రచారం సమయంలో 100 మంది కస్టమర్లు వచ్చేవారని.. కానీ ఈసారి, ఎన్నికలకు సంబంధించిన ఒక్క వ్యక్తి కూడా రాలేదని చెప్పారు. ఇదే విషయంపై బిర్యానీ తయారీదారులే కాదు .. కొంతమంది రాజకీయ పార్టీ నేతలు కూడా స్పందించారు. తమ ఇంట్లో కార్యకర్తలకు ఆహారం ఇస్తున్నామని .. కొన్ని చోట్ల సాంబార్ రైస్.. పెరుగన్నం ఇలా తక్కువ ఖర్చుతో ఉన్న ఆహారాన్ని ఇస్తున్నామని చెప్పారు.

Also Read: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు

నారూటే సెపరేట్ అంటున్న నటుడు, అభ్యర్థి .. చెత్త కుండీ పక్కన కూర్చుని చేతిలో కుక్కతో ఎన్నికల ప్రచారం