AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లెటర్ బాంబ్’… మహారాష్ట్రలో ‘వసూళ్ల’ ఉద్దవ్ ప్రభుత్వం, మండిపడిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్

మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్...

'లెటర్ బాంబ్'... మహారాష్ట్రలో 'వసూళ్ల'  ఉద్దవ్ ప్రభుత్వం, మండిపడిన కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్
Ravi Shankar Prasad
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 21, 2021 | 3:42 PM

Share

మహారాష్ట్రలో సీఎం ఉద్దవ్ థాక్రే ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఆరోపించారు. మాజీ పోలీసు అధికారి సచిన్ వాజేను ఆ రాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ ఇంకా ఏమేం డర్టీ పనులు చేయాల్సిందిగా  ఆదేశించారని ఆయన ప్రశ్నించారు. ఇది పెద్ద లూటీ వ్యవహారమని, కేవలం ఒక మంత్రికి సంబందించినదే కాదని, ఉద్దవ్ సర్కార్ కి కూడా సంబంధించినదని ఆయన అన్నారు. ముంబైలోని బార్లు, రెస్టారెంట్లు, హోటళ్ల నుంచి ప్రతి నెలా 100 కోట్ల రూపాయలు వసూలు చేయాలని సచిన్ వాజేను అనిల్ ఆదేశించినట్టు వచ్చిన ఆరోపణ చాలా తీవ్రమైనదని, దీనిపై  ఇంత రచ్ఛ జరుగుతున్నా ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మౌనంగా ఉండడమేమిటని రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఆయన మౌనం పై ఎన్నో సందేహాలు కలుగుతున్నాయన్నారు. సచిన్ వాజేని సీఎం ఉధ్ధవ్ థాక్రే ఈ మధ్య  సమర్థించడంలోని ఔచిత్యాన్ని కూడా రవిశంకర్ ప్రశ్నించారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ముఖ్యమంత్రికి, హోమ్ మంత్రికి,  మాజీ పోలీసు కమిషనర్ కి కూడా పాత్ర ఉన్నట్టుంది అన్నారు.

సచిన్ వాజే ని ఇదివరలో కూడా పలుమార్లు  సస్పెండ్ చేశారని, కానీ కరోనా సమయంలో మళ్ళీ నియమించారని, ఆయనకు ఓ రాజకీయ పార్టీతో సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోందని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు. ముకేశ్ అంబానీ ఇంటి వద్ద బాంబు కేసులో సచిన్ ని జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారిస్తున్నారు. నిన్నటికి నిన్న అతడిని ఘటన స్థలానికి తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయించారు. ఈ కేసులో ఒక నిందితునిగా ఉన్న మాజీ పోలీసు అధికారి గతంలో తనకు చెప్పిన విషయాలను మాజీ పోలీస్ కమిషనర్ పరమ్ బీర్ సింగ్ ఓ లేఖ ద్వారా మహారాష్ట్ర ముఖ్యమంత్రికి తెలియజేశారు. అయితే తాను ఈ-మెయిల్ ద్వారా ఈ లేఖను సీఎంకు పంపినట్టు పరం బీర్ సింగ్ తాజాగా వెల్లడించారు.

మరిన్ని ఇక్కడ చూడండి: Anand Deverakonda : డ్యాన్స్ మూమెంట్స్ తో అదరగొట్టిన దేవరకొండ బ్రదర్.. వీడియో వైరల్

Telangana News: తేనె తుట్టెకు పొగబెట్టాలనుకున్నాడు.. తానే బుగ్గిగా మారిపోయాడు.. విషాదం