Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana News: తేనె తుట్టెకు పొగబెట్టాలనుకున్నాడు.. తానే బుగ్గిగా మారిపోయాడు.. విషాదం

నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సులోని తేనె తుట్టెకు నిప్పు పెట్టడంతో.. ప్రమాదవశాత్తూ మంటలంటుకొని...

Telangana News: తేనె తుట్టెకు పొగబెట్టాలనుకున్నాడు.. తానే బుగ్గిగా మారిపోయాడు.. విషాదం
Man Died In Fire Mishap
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 3:57 PM

నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణంలో శనివారం తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సులోని తేనె తుట్టెకు నిప్పు పెట్టడంతో.. ప్రమాదవశాత్తూ మంటలంటుకొని ఓ వ్యక్తి  చనిపోయాడు.  కరోనా కారణంగా గత కొద్ది నెలలుగా బడులు మూతబడిన విషయం తెలిసిందే.  దీంతో పట్టణంలోని ఓ ప్రైవేటు స్కూల్‌కు చెందిన బస్సులను ఖాళీ స్థలంలో పార్క్ చేశారు. ఏడాదిగా వాటిని కదపకపోవడంతో ఓ బస్సులో తేనెటీగలు ఆవాసాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. తేనెతుట్టెను గమనించిన బుడగజంగాల మహదేవ్‌(55), గోపిలు దాన్ని రాల్పాలనుకున్నారు. పొగ పెడితే తేనెటీగలు పారిపోతాయని, అప్పుడు తేనెను ఈజీగా తీసుకోవచ్చని మహదేవ్‌ బస్సులోకి వెళ్లి మంట వెలిగించాడు.

ఈ క్రమంలో ప్రమాదవశాత్తు బస్సుకే మంటలు అంటుకున్నాయి. భయపడిన గోపి అక్కడినుంచి పరిగెత్తాడు. ఈ క్రమంలోనే పక్కనే ఉన్న మరో రెండు బస్సులకూ మంటలు నిమిషాల వ్యవధిలో వ్యాపించాయి. విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడికి వచ్చి ఓ ఇంటి నల్లాకు మోటారు అమర్చి మంటలార్పారు. అయితే అక్కడ ఎవరూ లేరు.. ప్రమాదవశాత్తూ మంటలు అంటుకుని ఉండొచ్చని అందరూ భావించారు. అయితే గంటన్నర తర్వాత మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాక  ఓ యువకుడు బస్సెక్కగా.. అక్కడ మహదేవ్‌ మృతదేహం కనిపించింది. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సీఐ శంకర్‌ ఆధ్వర్యంలో పోలీసులు డెడ్‌బాడీని బయటకు తీసి పోస్టుమార్టానికి తరలించారు. మహదేవ్‌ తమ్ముడి కంప్లైంట్‌తో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాగా మహదేవ్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

Also Read:  Meat shops: మంగళవారం మాంసం షాపులు మొత్తానికే బంద్.. తీవ్ర వివాదమవుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం

పెళ్లి అయిన 5 రోజుల తర్వాత అత్త కొడుకుతో నవవధువు జంప్.. పాపం ఆ పెళ్లికొడుకు ఇప్పటికి కూడా..