AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుంభ్ మేళాకు కరోనా వైరస్ భయం, వ్యాప్తి చెందితే డేంజర్, ఉత్తరాఖండ్ కి కేంద్రం వార్నింగ్

హరిద్వార్ లో జరిగే కుంభ్ మేళాకు లక్షలాది భక్తులు,  యాత్రికులు వస్తారని, అందువల్ల తక్షణమే కోవిడ్ నివారణ చర్యలు టీసుకోవాలని కేంద్రం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదేశించింది.

కుంభ్ మేళాకు  కరోనా వైరస్ భయం,  వ్యాప్తి చెందితే డేంజర్, ఉత్తరాఖండ్ కి కేంద్రం వార్నింగ్
Kumbh Mela
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 21, 2021 | 3:23 PM

Share

హరిద్వార్ లో జరిగే కుంభ్ మేళాకు లక్షలాది భక్తులు,  యాత్రికులు వస్తారని, అందువల్ల తక్షణమే కోవిడ్ నివారణ చర్యలు టీసుకోవాలని కేంద్రం ఉత్తరాఖండ్ రాష్ట్రాన్ని ఆదేశించింది. ఇప్పటికే కేంద్రం నుంచి ఓ నిపుణుల బృందం ఉత్తరాఖండ్ ను విజిట్ చేసి అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను, కోవిడ్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించింది. మొదట ఈ బృందం అక్కడి మెడికల్ కేర్ విషయంలో ప్రభుత్వ ఉదాసీనత పట్ల ఆందోళన వ్యక్తం చేసింది. ఈ టీమ్ సమర్పించిన నివేదిక ఆధారంగా కేంద్రం.. ఉత్తరాఖండ్ కు పలు సూచనలు చేసింది. ఇప్పటికే రోజుకు 10 నుంచి 20 మంది యాత్రికులు కరోనా వైరస్ పాజిటివ్ కి గురవుతున్నారని, కుంభ్ మేళా సంర్భంగా  వీరి కారణంగా ఇతర భక్తులకు కూడా ఈ వైరస్ సోకె ప్రమాదం ఉందని పేర్కొంది. అందువల్ల టెస్టింగులను పెంచాలని.ఇప్పుడు హరిద్వార్ లో నిర్వహిస్తున్న రాపిడ్ యాంటిజెన్ టెస్టులు, ఆర్ టీ పీసీఆర్ టెస్టులు చాలవని, ఈ సంఖ్యను మరింత పెంచాలని సూచించింది. దేశంలో ప్రస్తుతం కొత్తగా 43 వేలకుపైగా కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని, సుమారు 12 నుంచి 15 రాష్ట్రాల్లో ఐ ఈ కేసులున్నాయని కేంద్రం వెల్లడించింది. కుంభ్ మేళాకు వెళ్లే లక్షలాది భక్తులు ఎక్కువగా ఈ రాష్ట్రాలకు చెందినవారేనని అభిప్రాయపడింది.

ఈ దృష్ట్యా, ఉత్తరాఖండ్ ప్రభుత్వం కోవిడ్ నివారణకు  ప్రత్యేక చర్యలు తీసుకోవాలని బీజేపీ ప్రభుత్వం కోరింది. దేశ వ్యాప్తంగానే కాకుండా విదేశాల నుంచి కూడా వేల సంఖ్యలో ఈ మహా కుంభ్ మేళాకు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.ముఖ్యంగా  యాత్రికులు పవిత్ర స్నానాలు చేసే నదుల వద్ద, అత్యంత జాగరూకత చర్యలు చేపట్టాలని కూడా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సూచించింది. ప్రతి ఆరోగ్య శిబిరం వద్ద వలంటీర్లను నియమించాలని కూడా కోరింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Anek Movie : ‘అనేక్’ ముచ్చట్లు చెబుతున్న బాలీవుడ్ లవర్ బాయ్.. ఈ సినిమా తనకు వెరీ వెరీ స్పెషల్ అంటూ ఎమోషన్..

Om Birla Tested Positive: లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు