Om Birla Tested Positive: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్.. ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్న వైద్యులు
Lok Sabha Speaker Om Birla: లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి..
లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఢిల్లీ ఎయిమ్స్‌లో ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఓంబిర్లా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. అయితే జనవరి 19న కోవిడ్ పరీక్ష చేయించుకోవడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని వైద్యులు తెలిపారు.
ఇదిలావుంటే.. భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి రోజు రోజుకు వేగంగా పెరుగుతోంది. గతంలో కేసుల సంఖ్య తగ్గినట్లు తగ్గి మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. భారత్‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,845 మందికి పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరగ్య మంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది. ఇప్పటి వరకు మొత్తం 1,15,99,130కి చేరగా, కొత్తగా 22,956 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.
దీంతో మొత్తం రికవరీల సంఖ్య 1,11,30,288కి చేరగా, రివకరీ రేటు 96.12 శాతానికి తగ్గింది. ఇక కరోనాతో తాజాగా 188 మంది మృతి చెందగా, ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 1,59,755 కు చేరింది. ఇక మరణాల రేటు 1.38శాతానికి చేరింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,09,089కు చేరింది. అలాగే మహారాష్ట్రలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. అక్కడ శనివారం ఒక్క రోజు 27వేల కేసులకుపైగా నమోదు కావడంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. దేశ వ్యాప్తంగా నమోదైన కేసుల్లో సగానికిపైగా మహారాష్ట్ర నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి: Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి