Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది.

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి
Chittoor Corona Cases
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 21, 2021 | 1:47 PM

ప్రపంచవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కలవరపెడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగింది. ఏపీలోని చిత్తూరు జిల్లాలో మహమ్మారి ఉధృతి అధికంగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా మరే జిల్లాలో నమోదుకాని రీతిలో చిత్తూరు జిల్లాలో కేసుల సంఖ్య పెరగడం జిల్లావాసులను కలవరపెడుతోంది. గత ఏడాది కాలంలో జిల్లాలో 88,349 కేసులు నమోదవగా 857 మంది కరోనా బారిన పడి మృత్యువాతపడ్డారు. అత్యధిక మరణాలతో రాష్ట్రంలో ఫస్ట్ ప్లేసులో ఉన్న చిత్తూరు జిల్లా … తాజాగా నమోదవుతున్న కేసులు కూడా అదే స్థాయిలో ఉండటంతో అధికారుల్లో టెన్షన్ నెలకుంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2083 యాక్టివ్‌ కేసులు ఉండగా.. వాటిలో 490 కేసులు చిత్తూరు జిల్లాలోనే ఉండటం పరిస్థితుల తీవ్రతను వివరిస్తుంది.

కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో అలర్టైన అధికారులు వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేశారు. వ్యాక్సిన్‌పై ఉన్న అపోహలు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.  కరోనా పాజిటీవ్‌ ఉన్న వారిని హోం ఐసొలేషన్‌లో ఉంచి.. వారి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షించేందుకు స్పెషల్ టీమ్స్ రంగంలోకి దించారు. పద్మావతి కోవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స అందివ్వడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కేసుల సంఖ్య పెరగడానికి గల కారణాలపై అధికారులు చాలా కారణాలు చెబుతున్నారు. కరోనా కేసులు తీవ్రంగా ఉన్న మహారాష్ట్రతో పాటు ఉత్తరాది రాష్ట్రాల నుంచి తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వచ్చే భక్తుల ద్వారా మహమ్మారి వ్యాప్తి చెందుతుందనే అనుమానాలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ ద్వారా 25 వేల తిరుమల శ్రీవారి దర్శన టికెట్లను ఆన్‌లైన్‌ ద్వారా ప్రతినెలా విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. వీటిని దేశంలోని వివిధ ప్రాంతాల భక్తులు కొనుగోలు చేసే అవకాశం ఉండటంతో ఉత్తరాధి భక్తులు శ్రీవారి దర్శనానికి ఎక్కువగా వస్తున్నారు.

Also Read:  Orvakal airport: కర్నూలు జిల్లా ప్రజలకు గుడ్ న్యూస్.. 28వ తేదీ నుంచి ఓర్వకల్ ఎయిర్‌పోర్టులో విమాన సర్వీసులు

Meat shops: మంగళవారం మాంసం షాపులు మొత్తానికే బంద్.. తీవ్ర వివాదమవుతున్న మున్సిపల్‌ కార్పొరేషన్‌ నిర్ణయం