మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..

Maharashtra Coronavirus cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజూకూ కేసులు విచ్చలవిడిగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన

మహారాష్ట్రలో కొనసాగుతున్న కరోనా విజృంభణ.. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కేసుల నమోదు..
Maharashtra Corona
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2021 | 10:11 PM

Maharashtra Coronavirus cases: దేశవ్యాప్తంగా కరోనావైరస్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. రోజురోజూకూ కేసులు విచ్చలవిడిగా పెరుగుతుండటంతో అంతటా ఆందోళన నెలకొంది. ముఖ్యంగా మహారాష్ట్రలోనే కరోనా కేసులు రోజురోజుకూ రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. తాజాగా మళ్లీ రికార్డు స్థాయిలో కేసులు వెలుగులోకి వచ్చాయి. శుక్రవారం నుంచి శనివారం సాయంత్రం వరకు 24 గంటల వ్యవధిలో కొత్తగా 27,126 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 92 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు మహారాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ శనివారం సాయంత్రం కరోనా హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం.. మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 24,49,147 కి చేరుకోగా.. మరణించిన వారి సంఖ్య 53,300 కి పెరిగింది.

ఇదిలాఉంటే.. గత 24 గంటల్లో కరోనా నుంచి 13,588 మంది రోగులు కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 22,03,553 కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం మహారాష్ట్ర వ్యాప్తంగా 1,91,006 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. అయితే గత 24 గంటల్లో అత్యధికంగా పూణే జిల్లాలో కేసులు నమోదయ్యాయి. ఈ జిల్లాలో 5,473 కరోనా కేసులు నమోదు కాగా.. 27 మంది మరణించినట్లు వైద్యశాఖ వెల్లడించింది.

ఇదిలాఉంటే.. దేశంలో కరోనా కేసులు, మరణాల పరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతోంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం పలు ఆంక్షలను విధించి చర్యలు తీసుకుంటోంది. పలు ప్రాంతాల్లో లాక్డౌన్, నైట్ కర్ఫ్యూను కూడా అమలు చేస్తున్నారు అయినప్పటికీ కోవిడ్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మంత్రి ఆదిత్య ఠాక్రే కూడా కరోనా బారిన పడ్డారు.

Also Read:

Coronavirus: మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులను వెంటాడుతున్న కరోనా.. మంత్రి ఆదిత్య ఠాక్రేకు పాజిటివ్

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక అప్డేట్..! పూర్తి వివరాలు

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే