Coronavirus: మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులను వెంటాడుతున్న కరోనా.. మంత్రి ఆదిత్య ఠాక్రేకు పాజిటివ్

Aaditya Thackeray tests Covid-19 positive: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి ఎవ్వరినీ

Coronavirus: మహారాష్ట్రలో ప్రజాప్రతినిధులను వెంటాడుతున్న కరోనా.. మంత్రి ఆదిత్య ఠాక్రేకు పాజిటివ్
Aaditya Thackeray Tests Covid 19 Positive
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2021 | 7:18 PM

Aaditya Thackeray tests Covid-19 positive: దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతూనే ఉంది. ఎన్ని చర్యలు తీసుకున్నప్పటికీ ఈ మహమ్మారి ఎవ్వరినీ వదిలిపెట్టడం లేదు. సాధారణ ప్రజల దగ్గరి నుంచి సెలబ్రిటీలు, ప్రజాప్రతినిధుల వరకూ అందరూ కోవిడ్ మహమ్మారి బారిన పడుతున్నారు. అయితే మహారాష్ట్రలో ఈ సంఖ్య అధికంగా ఉంది. ఇప్పటికే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వంలోని చాలామంది మంత్రులు ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే తనయుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే కోవిడ్ బారిన పడ్డారు. ఈ మేరకు ఆదిత్య శనివారం సాయంత్రం ట్విట్ చేసి వెల్లడించారు. తేలికపాటి లక్షణాలు కనిపించడంతో.. పరీక్షలు చేయించుకున్నానని.. కోవిడ్ పాజిటివ్‌గా నిర్థారణ అయినట్లు ఆయన వెల్లడించారు. ఇటీవల కాలంలో తనను కలిసిన వారంతా పరీక్షలు చేయించుకోవాలని కోరారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ అందరూ జాగ్రత్తగా ఉండాలంటూ ఆదిత్య ఠాక్రే సూచించారు.

ఇప్పటికే మహారాష్ట్రలో కరోనా విజృంభిస్తోంది. రాష్ట్రంలో రోజూ వారి కేసుల సంఖ్య 30వేలకు చేరువగా నమోదవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం పలు ప్రాంతాల్లో లాక్‌డౌన్‌తో పాటు నైట్ కర్ఫ్యూను అమలుచేస్తున్నారు. అయినప్పటికీ కేసులు పెరిగిపోతుండటంతో రాష్ట్రంలో ఆందోళన నెలకొంది.

Also Read:

లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆ యువతి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్..

సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
మీ ఇంట్లో పాత ఎల్ఐసీ బాండ్ ఉందా..? ఇలా చేస్తే సొమ్ము వాపస్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
యువతిపై లైంగిక వేధింపులు.. ప్రముఖ బుల్లితెర నటుడు అరెస్ట్
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
10 రోజుల షూటింగ్ కోసం రూ.9 కోట్లు రెమ్యునరేషన్..
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
వచ్చే బడ్జెట్‌లో మధ్యతరగతి వారికి భారీ ఉపశమనం.. కేంద్రం సన్నాహాలు
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
రెచ్చగొట్టిన ఆసీస్ ఫ్యాన్స్..తెలుసుగా విరాట్‌తో మాములుగా ఉండదని..
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
బ్యాంకులకు ఆర్‌బీఐ షాక్.. ఖాతాదారులకు జరిమానా చెల్లించాల్సిందే..!
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
3 పెళ్లిళ్లు, రూ.1.25 కోట్లు వసూలు ‘లూటీ వధువు’ అరెస్ట్‌.! ఇలా..
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పెరుగుతున్న యూపీఐ పేమెంట్లు.. రోజు వారీ పరిమితి తెలిస్తే షాక్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్
పిల్లబచ్చా కాదు చిచ్చరపిడుగు.. కోహ్లీతో బుల్ ఫైట్, 5 రోజుల బ్యాన్