బ్లేడ్‌తో గర్భిణీకి ఆపరేషన్ చేసిన 8వ తరగతి చదివిన వ్యక్తి.. తల్లీ బిడ్డ ఇద్దరు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన..

Uttar Pradesh Crime : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన గర్భిణీకి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి బ్లేడుతో ఆపరేషన్ చేయడంతో తల్లీబిడ్డ ఇద్దరు మృతి చెందారు. స్థానికంగా

బ్లేడ్‌తో గర్భిణీకి ఆపరేషన్ చేసిన 8వ తరగతి చదివిన వ్యక్తి.. తల్లీ బిడ్డ ఇద్దరు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన..
Uttar Pradesh Crime
Follow us

|

Updated on: Mar 20, 2021 | 3:59 PM

Uttar Pradesh Crime : ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. చికిత్స కోసం వచ్చిన గర్భిణీకి ఆస్పత్రిలో పనిచేసే ఓ వ్యక్తి బ్లేడుతో ఆపరేషన్ చేయడంతో తల్లీబిడ్డ ఇద్దరు మృతి చెందారు. స్థానికంగా కలకలం రేపిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితుల కథనం ప్రకారం.. రాజారామ్ అనే వ్యక్తి గర్భిణీ అయిన తన భార్య పూనమ్‌ను ప్రసవం కోసం ఒక మంత్రసాని దగ్గరకు తీసుకెళ్లాడు. అయితే ఆ మంత్రసాని ఆమెను డీహ్ ప్రాంతంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించమని సూచించింది. అక్కడ పూనమ్‌ను పరిస్థితిని చూసిన నర్సు.. పరిస్థితి విషమంగా ఉందని వెంటనే ఆమెను పెద్దస్పత్రికి తీసుకెళ్లమని సలహా ఇచ్చింది. దీంతో అతడు రాజేష్‌కు చెందిన నర్సింగ్ హోమ్‌లో చేర్పించారు.

అక్కడ అనుభవం లేని రాజేంద్ర శుక్లా పూనమ్‌కు చికిత్స అందించాడు. ఆపరేషన్ చేసేందుకు రేజర్ బ్లేడ్ వాడాడు. దీంతో పూనమ్‌కు గాయాలు కావడంతో తీవ్ర రక్తస్రావం జరిగింది. అనంతరం ఆమెను జిల్లా ఆస్పత్రికి తరలించమని అక్కడివారు తెలిపారు. వెంటనే రాజారాం ఆమెను లక్నోలోని KGMU Trauma Centreకు తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. అయితే సమీపంలో ఆస్పత్రులు లేకపోవడంతో రాజారామ్ తన భార్యను 140 కిలోమీటర్ల దూరంలో లక్నోలోని KGMU Trauma Centreకు తరలించాడు. అయితే తీవ్ర గాయాలతో బాధపడుతున్న ఆమె అక్కడ చికిత్స పొందుతూ మరణించింది. ఈ సంఘటనపై రాజారామ్ ఆస్పత్రి నిర్లక్ష్యం వల్లే మరణించిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో విచారించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి.

రాజేశ్ సహనీ అనే వ్యక్తి Maa Sharda Hospital పేరుతో రిజస్ట్రర్ చేయకుండా, మౌలిక సదుపాయాలు లేకుండా నిర్వహిస్తున్నాడు. అందులో పనిచేసేందుకు రాజేంద్ర శుక్లా అనే వ్యక్తిని నియమించుకున్నాడు. ఇతగాడు ఎనిమిదో తరగతి చదివి డ్రాప్ అవుట్ అయ్యాడు. ఎటువంటి జాగ్రత్తలు లేకుండా, అనుభవం లేకుండా బ్లేడ్‌తో ఆపరేషన్ చేసి ఇద్దరు ప్రాణాలను పొట్టనపెట్టుకున్నాడు. రాజారామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు రాజేంద్ర శుక్లా, రాజేష్ సాహ్నిపై కేసు నమోదు చేశారు.

Schools in Block List: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సంచలన ప్రకటన.. 259 ప్రైవేటు పాఠశాలల గుర్తింపు రద్దు..

ఎటు చూసినా కట్టలకు కట్టల నోట్లు.. గుట్టలకు గుట్టల మనీ.. కమల్‌ హాసన్ పార్టీ ట్రెజరర్ ఇంట్లో దొరికిన డబ్బు..