పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందూ జర్నలిస్ట్ కాల్చివేత, దుండగుల పరారీ, పోలీసుల గాలింపు

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ  రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల  ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన  కూర్చుని ఉండగా..

పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందూ జర్నలిస్ట్ కాల్చివేత, దుండగుల పరారీ, పోలీసుల గాలింపు
Ajay Lalwani
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 20, 2021 | 5:13 PM

పాకిస్తాన్ లోని సింధ్ ప్రావిన్స్ లో అజయ్ లాల్వానీ అనే 31 ఏళ్ళ హిందూ జర్నలిస్టును దుండగులు కాల్చి చంపారు. ఈ  రాష్ట్రంలోని సుక్కూర్ సిటీలో గల  ఓ సెలూన్ లో హెయిర్ కట్ కోసం ఆయన  కూర్చుని ఉండగా.. ఓ కారులోను,  రెండు  బైక్ ల పై  వచ్చిన గుర్తు తెలియని దుండగులు ఆయనపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో లాల్వానీ  కడుపు,  మోచేతులు, కాళ్లపై బుల్లెట్ గాయాలయయ్యాయి. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. రాయల్ న్యూస్ ఛానల్ కు, ఓఉర్దూ వార్తా పత్రికకు ఆయన రిపోర్టర్ గా పని చేస్తున్నారు. పాత కక్షల కారణంగా ఈ హత్య జరిగిందని పోలీసులు చెబుతుండగా..అలాంటిదేమీ లేదని, తమ కుమారుడికి శత్రువులెవరూ లేరని లాల్వానీ తండ్రి  దిలీప్ కుమార్ స్పష్టం చేశారు. అజయ్ లాల్వానీ హత్యను పాక్ నేషనల్ అసెంబ్లీ లోని హిందూ సభ్యుడు లాల్ చంద్ మల్హీ తీవ్రంగా ఖండించారు. సింధ్ ప్రావిన్స్ లో హిందూ జర్నలిస్టులపై దాడులు, ఈ విధమైన హత్యలు  జరగడం దారుణమని, ఈ రాష్ట్రంలో తమకు భద్రత లేదని మీడియావారు భయపడుతున్నారని ఆయన ట్వీట్ చేశారు.

కాగా ఈ హత్యకు గల కారణాలపై తాము దర్యాప్తు చేస్తున్నామని, వృత్తి పరంగా లాల్వానీకి ఎవరైనా శత్రువులు ఉన్నారా అన్న విషయంపై ఆరా తీస్తున్నామని పోలీసులు చెబుతున్నారు. అటు లాల్వానీ అంత్యక్రియలకు ఈ రాష్ట్రంలోని పలు నగరాల నుంచి పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు హాజరయ్యారు. పాకిస్థాన్ లో సుమారు 75 లక్షల మంది హిందువులు నివసిస్తున్నారు.  వీరిని మైనారిటీ వర్గంగా పరిగణిస్తున్నారు. ఇలాగే సిక్కులు, క్రైస్తవులు కూడా ఇక్కడ మైనారిటీలే.

మరిన్ని ఇక్కడ చూడండి: Ayodhya Ram Mandir: మరింత సువిశాలంగా అయోధ్యలో భవ్య రామమందిరం.. పూర్తి వివరాలు..

వాట్సాప్ 55 నిముషాలు పోతే..బెంగాల్ లో 55 ఏళ్ళ పాటు అభివృద్ధి మటాష్, పీఎం మోదీ

మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
SRH కెప్టెన్‌ కమిన్స్‌ను కలిసిన మహేశ్ సతీమణి నమ్రత.. ఫొటోస్
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈ పైనాపిల్స్ మధ్య మూడు మొక్కజొన్నలు నక్కాయి.. కనిపెట్టండి చూద్దాం
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే
ఈసీ సంచలన నిర్ణయం.. ఇద్దరు ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు..కారణమిదే