వాట్సాప్ 55 నిముషాలు పోతే..బెంగాల్ లో 55 ఏళ్ళ పాటు అభివృద్ధి మటాష్, పీఎం మోదీ

వాట్సాప్, ఇన్స్ టా గ్రామ్ లు శుక్రవారం 55 నిముషాలపాటు పోతే (డౌన్) బెంగాల్ లో  గత 50 నుంచి  55 ఏళ్లపాటు అభివృద్ధి అంటూ లేకుండా పోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు.

వాట్సాప్ 55 నిముషాలు పోతే..బెంగాల్ లో 55 ఏళ్ళ పాటు అభివృద్ధి మటాష్, పీఎం మోదీ
Modi
Follow us

| Edited By: Phani CH

Updated on: Mar 20, 2021 | 5:06 PM

వాట్సాప్, ఇన్స్ టా గ్రామ్ లు శుక్రవారం 55 నిముషాలపాటు పోతే (డౌన్) బెంగాల్ లో  గత 50 నుంచి  55 ఏళ్లపాటు అభివృద్ధి అంటూ లేకుండా పోయిందని ప్రధాని మోదీ ఆరోపించారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరారు. శనివారం బెంగాల్ లోని  ఖరగ్ పూర్ లో జరిగిన ఎన్నికల సభలో మాట్లాడిన ఆయన.. మీ కోసం మేం ప్రాణాలర్పిస్తాం అని ఓటర్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.’అబ్ కీ బార్ మోదీ కీ సర్కార్’ అనే పదజాలం స్థానే ఆయన ‘  బెంగాల్  మే ఇస్ బార్ బీజేపీకీ సర్కార్’ అని నినాదం చేశారు. బెంగాలీల కష్టాలను  మా ప్రభుత్వ హయాంలో తీరుస్తాం అని హామీ ఇచ్చారు. నిన్న సుమారు 55 నిముషాలపాటు  వాట్సాప్, ఫేస్ బుక్, ఇన్స్ టా గ్రామ్   డౌనయ్యాయని, అందరూ ఆందోళన చెందారని..  కానీ బెంగాల్ లో యాభై నుంచి యాభై ఐదేళ్లు వికాసం (అభివృద్ధి) కుంటుపడిందని మోదీ అన్నారు.మొదట కాంగ్రెస్ పార్టీ, ఆ తరువాత లెఫ్ట్, ఇప్పడు తృణమూల్ కాంగ్రెస్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకున్నాయని ఆయన అన్నారు. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తుందని, 70 ఏళ్లుగా సాగిన లూటీని ఈ పార్టీ అంతం చేస్తుందని,  రాష్ట్రంలో అసలైన మార్పును తెస్తుందని ఆయన చెప్పారు.

ఒక్క ఐదేళ్లు ఛాన్సిస్తే ఈ రాష్ట్ర ప్రజల సంక్షేమానికి అన్ని చర్యలూ తీసుకుంటామని, అన్ని వర్గాల ప్రజలకూ పూర్తి  న్యాయం చేకూరేలా కృషి చేస్తామని మోదీ అన్నారు. ఇక్కడి రైతులు, కార్మికులు..ఇలా అన్ని వర్గాల అభివృధ్దే బీజేపీ లక్ష్యమన్నారు.  ఇక్కడి హెల్త్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ ని పూర్తిగా మెరుగుపరుస్తామన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ని మోదీ ప్రశంసిస్తూ.. తనపై ఎన్నిసార్లు  దాడులు జరిగినా ఘోష్ ఖాతరు చేయకుండా బెంగాల్ లో పార్టీ అభివృద్ధికి పాటు పడుతూ వచ్చారన్నారు. బెంగాల్ భవితవ్యం కోసం పోరాడుతూ వస్తున్నారు ఆయన అని మోదీ పేర్కొన్నారు. ఇక దిలీప్ ఘోష్..బెంగాల్ ఇప్పుడు ‘వీల్ చైర్’ లో ఉందని ఎద్దేవా చేశారు. సీఎం, టీఎంసీ  అధినేత్రి వీల్ చైర్ లోనే ప్రచారం చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని ఇక్కడ చూడండి: Kamal Haasan got injured : ఒక్కసారిగా మీదపడ్డ అభిమానులు, డాక్టర్ల సూచనతో ఎన్నికల ప్రచారం నిలిపివేసిన కమల్ హాసన్

ఐదో టీ20: ఆ ఇద్దరి ఆటగాళ్లపై వేటు.. టీమిండియా తుది జట్టులో భారీ మార్పులు.. ఎవరెవరంటే.!