AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక అప్డేట్..! పూర్తి వివరాలు

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద కనుగొన్న వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ ప్రమాదకరమైనవి కావని, భారీ నష్టం కలిగించేవి కూడా కావని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు.

ముకేశ్ అంబానీ ఇంటివద్ద పేలుడు పదార్థాల కేసులో కీలక అప్డేట్..! పూర్తి వివరాలు
Suv Found Near Ambani House
Umakanth Rao
| Edited By: Phani CH|

Updated on: Mar 20, 2021 | 6:54 PM

Share

ముంబైలో పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ ఇంటివద్ద కనుగొన్న వాహనంలోని జిలెటిన్ స్టిక్స్ ప్రమాదకరమైనవి కావని, భారీ నష్టం కలిగించేవి కూడా కావని ఫోరెన్సిక్ నిపుణులు తేల్చారు. అయితే ఇవి స్వల్పంగా పేలుడు ఎక్స్ ప్లోజివ్స్ అని చెప్పవచ్చునని వారన్నారు. ఈ జిలెటిన్ స్టిక్స్ లో అమ్మోనియం నైట్రేట్ ఉన్నట్టు వారు చెప్పారు. సాధారణంగా అమ్మోనియం నైట్రేట్ కి మండే స్వభావం ఉంటుంది.  దీని మోతాదు ఈ జిలెటిన్ స్టిక్స్ లో తక్కువగా ఉన్నట్టు ఫోరెన్సిక్ బృందం వెల్లడించింది. బావులు తవ్వడానికి, రోడ్ల నిర్మాణానికి ఈ విధమైన వాటిని ఎక్కువగా  గ్రామీణ ప్రాంతాల్లో వినియోగిస్తుంటారని, ఏమైనా తమ నివేదికను మరో రెండు రోజుల్లోగా జాతీయ దర్యాప్తు సంస్థకు అందజేస్తామని ఓ అధికారి తెలిపారు. అసలు ఈ వాహనం సొంతదారు ఎవరు, దీని  రిజిస్టర్ నెంబర్ మార్చారా, ఈ వాహనం ఎవరి పేరున రిజిస్టర్ అయి ఉందన్న  విషయాలను కూడా తాము దర్యాప్తు చేస్తామని ఆ అధికారి చెప్పారు. అంతేకాదు.. ఈ ఎస్ యూ వీ వాహనంలో ఏవైనా రక్తపు మరకలు ఉన్నాయా,  డ్రైవింగ్ ని ఎవరు చేస్తున్నారనే అంశాన్ని కూడా ఇన్వెస్టిగేట్  చేస్తామన్నారు.

ఇలా ఉండగా ఈ వాహన యజమాని మాన్ సుఖ్ హీరేన్ మృత దేహం థానే లోని ఓ కాలువలో కనుగొన్న సంగతి తెలిసిందే. అతనికి ఎవరైనా డ్రగ్ ఇచ్చి ఉండవచ్చునన్న కోణంలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. తన భర్త  మృతిపై తనకు అనుమానాలు ఉన్నాయని హీరేన్ భార్య విమలా హీరేన్ పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో పేర్కొంది. ఇది పథకం ప్రకారం పన్నిన హత్య అని ఆమె ఆరోపించింది. కాగా ఈ కేసులో మాజీ పోలీసు అధికారి సచిన్ వాజెను  ఎన్ ఐ ఏ అధికారులు నిర్విరామంగా విచారిస్తున్నారు. నిన్న అంబానీ ఇంటివద్దకు ఆయనను తీసుకువెళ్లి అక్కడ సీన్ రీకన్స్ట్ర క్షన్ చేశారు. ఈ కేసు ఇలా రోజుకో మలుపు తిరుగుతోంది .

మరిన్ని ఇక్కడ చూడండి: మంచి మనసు చాటుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. గాయపడిన పోలీసుకు సపర్యలు.. వీడియో వైరల్

లైంగిక వేధింపుల కేసుపై స్పందించిన పాకిస్తాన్ కెప్టెన్.. ఆ యువతి గురించి ఏం చెప్పాడో తెలిస్తే షాక్..