మంచి మనసు చాటుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. గాయపడిన పోలీసుకు సపర్యలు.. వీడియో వైరల్

Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్‌ బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా తన మంచి మనుసును చాటుకున్నారు. ఎప్పుడూ బిజీబీజీగా ఉండే నేత..

మంచి మనసు చాటుకున్న జ్యోతిరాదిత్య సింధియా.. గాయపడిన పోలీసుకు సపర్యలు.. వీడియో వైరల్
Jyotiraditya Scindia Helps Injured Mp Cop
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 20, 2021 | 6:46 PM

Jyotiraditya Scindia: మధ్యప్రదేశ్‌ బీజేపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా తన మంచి మనుసును చాటుకున్నారు. ఎప్పుడూ బిజీబీజీగా ఉండే నేత.. ఓ పోలీస్‌కు ప్రథమ చికిత్స చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శనివారం సింధియా విమానాశ్రయం నుంచి మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నివాసానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న కాన్వాయ్‌లోని ఒక వాహనం నుంచి పోలీస్‌ ఒకరు కిందపడ్డారు. దీంతో ఆయన తలకు తీవ్ర గాయమైంది. దీంతో జ్యోతిరాదిత్య సింధియా వెంటనే స్పందించారు. తన వాహనం నుంచి దిగి గాయపడిన పోలీస్ వద్దకు వెళ్లారు. రక్తాన్ని అదుపు చేసేందుకు ఆయన పోలీసుకు ఫస్ట్‌ ఎయిడ్‌ చేశారు. అనంతరం ఆ పోలీసును ఆసుపత్రిలో చేర్చినట్లు నాయకులు వెల్లడించారు.

ఇదిలాఉంటే.. కాంగ్రెస్‌ మాజీ నేత అయిన జోత్యిరాదిత్య సింధియా సరిగ్గా ఇదే రోజున ఏడాది క్రితం.. తన అనుకూల ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీలో చేరారు. దీంతో మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం పడిపోయింది. అనంతరం బీజేపీ నేతృత్వంలోని శివరాజ్ సింగ్‌ చౌహాన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జ్యోతిరాధిత్య సింధియా బీజేపీ నుంచి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు.

Also Read:

DNA Test: హమ్మయ్య.. ఆ కుక్క యజమాని ఎవరో తెలిసిపోయింది.. డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లిన వ్యవహారం

Ayodhya Ram Mandir: మరింత సువిశాలంగా అయోధ్యలో భవ్య రామమందిరం.. పూర్తి వివరాలు..