DNA Test: హమ్మయ్య.. ఆ కుక్క యజమాని ఎవరో తెలిసిపోయింది.. డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లిన వ్యవహారం

Dog Ownership Dispute: ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో విశ్వాసంతో ఉండే జీవి ఒక కుక్క మాత్రమే. దానిని ప్రేమగా చేరదీస్తే చాలు మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి

DNA Test: హమ్మయ్య.. ఆ కుక్క యజమాని ఎవరో తెలిసిపోయింది.. డీఎన్ఏ పరీక్ష వరకు వెళ్లిన వ్యవహారం
Dispute Over Dog Ownership Resolved With Dna Test
Follow us

|

Updated on: Mar 20, 2021 | 5:45 PM

Dog Ownership Dispute: ప్రపంచంలో ఉన్న జీవులన్నింటిలో విశ్వాసంతో ఉండే జీవి ఒక కుక్క మాత్రమే. దానిని ప్రేమగా చేరదీస్తే చాలు మనకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడదు. అలాంటి కుక్క కోసం ఎన్నో సందర్భాల్లో యజమానులు పోరాడుకున్న సంఘటనలను మనం చూశాం. తాజాగా అలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. కానీ ఈ కుక్క వ్యవహారం డీఎన్ఏ పరీక్షల వరకూ వెళ్లింది. ఓ పెంపుడు కుక్క కోసం రెండు వర్గాల వివాదం.. డీఎన్ఏ పరీక్ష సహాయంతో పరిష్కారం అయింది. ఈ సంఘటన మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో జరిగింది. కోకో అనే లాబ్రడార్ జాతికి చెందిన కుక్క స్థానిక జర్నలిస్ట్ షాదాబ్ ఖాన్ ఇంటినుంచి తప్పిపోయింది. ఆ కుక్కను ఏబీవీపీ నాయకుడు కృతిక్ శివహారే అదుపులోకి తీసుకున్నాడంటూ షాదాబ్ ఖాన్ ఆరోపించాడు. చివరకు ఇరు వర్గాలు హోషంగాబాద్ పోలీస్ స్టేషన్‌ మెట్లక్కాయి.

దీంతో పోటీసులు రంగలోకి దిగి విచారణ చేపట్టారు. కుక్క టీకా రికార్డులు, కొనుగోలు ధృవీకరణ పత్రాన్ని చూసి ఆ కుక్కను ముందు షాదాబ్‌కు అప్పగించారు. వెంటనే శివహారే 2020 ఆగస్టులో ఆ కుక్కను కొన్నానని.. దానికి టైగర్ అని పేరు పెట్టినట్లు ఆధారాలు సమర్పించాడు. దీనిపై షాదాబ్ ఖాన్ నవంబర్ 18న డెహాట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి.. దానికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలంటూ రూ.30,000 చెల్లించారు. దీంతో డిసెంబర్‌లో డీఎన్‌ఏ పరీక్షను హైదరాబాద్‌లో నిర్వహించారు.

ఈ రిపోర్టు తాజాగా గురువారం (మార్చి 18) వచ్చింది. దీంతో ఈ కుక్క షాదాబ్ ఖాన్‌కు చెందినదని స్పష్టం కావడంతో.. పోలీసులు కోకోను ఆయనకు అప్పగించారు. దాదాపు ఆరు నెలల తర్వాత ఈ కేసు పరిష్కారమైందని పోలీసులు వెల్లడించారు.

Also Read:

పాక్ లోని సింధ్ ప్రావిన్స్ లో హిందూ జర్నలిస్ట్ కాల్చివేత, దుండగుల పరారీ, పోలీసుల గాలింపు

బ్లేడ్‌తో గర్భిణీకి ఆపరేషన్ చేసిన 8వ తరగతి చదివిన వ్యక్తి.. తల్లీ బిడ్డ ఇద్దరు మృతి.. ఉత్తరప్రదేశ్‌లో దారుణ ఘటన..