AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actor Mansoor Ali Khan : నారూటే సెపరేట్ అంటున్న నటుడు, అభ్యర్థి .. చెత్త కుండీ పక్కన కూర్చుని చేతిలో కుక్కతో ఎన్నికల ప్రచారం

మిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ.. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేస్తూ...

Actor Mansoor Ali Khan : నారూటే సెపరేట్ అంటున్న నటుడు, అభ్యర్థి ..  చెత్త కుండీ పక్కన కూర్చుని చేతిలో కుక్కతో ఎన్నికల ప్రచారం
Actor Mansoor Ali Khan
Surya Kala
|

Updated on: Mar 22, 2021 | 5:49 PM

Share

Actor Mansoor Ali Khan : తమిళనాడులో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ.. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులందరూ.. హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు మన్సూర్ అలీ ఖాన్ వినూత్నంగా ఎన్నికల ప్రచారం చేస్తూ వార్తల్లో నిలిచారు. శనివారం రోడ్డు ప్రక్కన ఉన్న ఓ చెత్త డబ్బా వద్ద కూర్చున్న అయన తన పక్కన ఓ వీధిని కుక్కను కూర్చోబెట్టుకున్నారు. చేతిలో పేపర్ పేడ్ పెట్టుకున్నారు. శనివారం, మన్సూర్ అలీ ఖాన్పెరూర్ పట్టీ స్వరర్ ఆలయం నుంచి తన ప్రచారాన్ని అధికారికంగా మొదలు పెట్టారు. ఆలయం వెలుపల దుకాణదారులతో సమావేశమయ్యారు. అనంతరం అతను చెత్త డబ్బా దగ్గర కూర్చుని, ఆ ప్రాంతంలో చెత్తను క్లియర్ చేయడానికి ఎవరు బాధ్యత వహిస్తారో అడిగి తెలుసుకున్నారు. ఒక వీధి కుక్కను దగ్గరకు తీసుకుని దానితో కొన్ని నిమిషాలు ఆడుకున్నారు. ఆ దారిలో వెళ్తున్న ప్రజలతో మాట్లాడి.. ఆ ప్రాంతాల్లోని సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. అంతేకాదు.. సమస్యలను.. అవి చెప్పినవారి చిరునామా రాసుకున్నారు. తాను ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేగా గెలిస్తే.. ఇప్పుడు ప్రజలు చెప్పిన సమస్యలను తీరుస్తానని వాగ్దానం చేశారు.

ఇక మన్సూర్ అలీ ఖాన్ కోయంబత్తూరులోని తోండముత్తూర్ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఈ మేరకు అధికారులు ధృవీకరించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం రాజకీయ నాయకులు కేవలం వాగ్దానాలు చేస్తూ.. తమిళనాడును నాశనం చేశారని పేర్కొన్నారు.

అయితే నటుడు మన్సూర్ ఇతర అభ్యర్థుల మాదిరిగా కాకుండా డిఫరెంట్ గా ప్రచారం చేస్తున్నారు. ఒంటరిగా ప్రచారం చేయడం ద్వారా ఓట్లు సంపాదించడానికి ప్రయత్నిస్తున్నారు. శుక్రవారం, తోండముత్తూర్ లోని గాంధీ పార్క్ ప్రాంతంలో వ్యాయామం చేశారు. సమీపంలోని మైదానంలో వాలీబాల్ ఆట కూడా ఆడారు. అక్కడ వారితో సెల్ఫీలు తీసుకున్నారు. అయితే ఈ నియోజక వర్గంలోని సిట్టింగ్ ఎమ్మెల్యే, ఎఐఎడిఎంకె రాష్ట్ర మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రి ఎస్పీ వేలుమణి, డిఎంకెకు చెందిన కార్తికేయ శివసేనపతి మధ్య పోటీ నెలకొంది.

Also Read: హైదరాబాద్ పాత, కొత్త సంప్రదాయాల సమ్మేళనం.. దేశంలోనే లివ్ బుల్ సిటీగా ప్రసిద్ధి.. ఆ ప్రాభవం కోల్పోతుందా..!

మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా..! అయితే ఈ విషయాలు తెలియకపోతే కష్టం.. ఒక్కసారి పరిశీలించండి..