మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా..! అయితే ఈ విషయాలు తెలియకపోతే కష్టం.. ఒక్కసారి పరిశీలించండి..

Guys Getting Married : మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేదంటే తర్వాత చాలా

మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా..! అయితే ఈ విషయాలు తెలియకపోతే కష్టం.. ఒక్కసారి పరిశీలించండి..
Guys Getting Married
Follow us
uppula Raju

|

Updated on: Mar 21, 2021 | 1:23 PM

Guys Getting Married : మీరు పెళ్లి చేసుకునే అబ్బాయిల లిస్ట్‌లో ఉన్నారా.. అయితే కచ్చితంగా మీరు ఈ విషయాలు తెలుసుకోవాలి.. లేదంటే తర్వాత చాలా నష్టపోతారు. అందుకే ఈ విషయాలు తెలుసుకోండి.. ఎందుకంటే మీరనుకున్న అమ్మాయి, అబ్బాయి దొరక్కపోవచ్చు. చాలా మంది పెళ్ళికి ముందు ఒకలా, పెళ్ళి తర్వాత మరోలా మారిపోవడానికి కారణం, వారనుకున్నట్లుగా జీవితభాగస్వామి దొరక్కపోవడమే. నిజం చెప్పాలంటే అలా దొరకాలని అనుకోకూడదు కూడా. అయితే అది మన చేతుల్లో లేదు.. ప్రేమ వివాహాల్లో ఇది కొంచెం సాధ్యమయ్యే పనే కానీ, చాలా ప్రేమలు పెళ్ళయ్యాక మారిపోతున్నాయి. అందుకే పెళ్లి విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. అయితే అబ్బాయిలు పెళ్లికి ముందు ఎటువంటి అంచనాలు పెట్టుకోకుండా ఖాళీ మైండ్‌తో ఉండటం బెటర్.. ఒక్కసారి ఈ విషయాలను పరిశీలిద్దాం..

1. పెళ్ళికి మీరు రెడీనా కాదా అన్నది తెలుసుకోవాలి. పెళ్ళితో మీ ఇద్దరు మాత్రమే ఒక్కటి కారు. మీ కుటుంబాలు కూడా ఒక్కటవుతాయి. పెళ్ళి తర్వాత ఏ సమస్య వచ్చినా మీతో పాటు మీ కుటుంబం కూడా బాధపడాల్సి ఉంటుందని మర్చిపోవద్దు. అందుకే మీరు పెళ్ళికి నిజంగా రెడీగా ఉన్నారో లేదో చెక్ చేసుకోండి.

2.మీక్కాబోయే అమ్మాయి గురించి చాలా కలలు కని ఉంటారు. ఆ కలలన్నింటికీ వ్యతిరేకంగా ఉండే అమ్మాయి మీ భాగస్వామి కావచ్చు. అందుకే నో ఎక్స్ పెక్టేషన్. కామ్ గా ఉండండి. ఒకవేళ మీరనుకున్నట్లు అమ్మాయి దొరికితే సంతోషమే కదా..

3. పెళ్ళయ్యాక మీ ఇద్దరి మధ్య జరిగే సంభాషణలు మీ స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ఎట్టి పరిస్థితుల్లో పంచుకోకూడదు. అది ఎంతమాత్రం మంచిది కాదని తెలుసుకోండి..

4.పెళ్ళి చేసుకున్నాక అవతలి వారి రంగు గురించి, కుటుంబ సభ్యుల గురించి అసహ్యంగా మాట్లాడటం వంటివి చేయరాదు. ఎందుకంటే కొంతమంది వాటిని తట్టుకోలేరు. హాస్యానికి కూడా అలాంటి పొరపాటు చేయవద్దు.

5. చిన్న చిన్న సమస్యలకు గొడవలకు పోవద్దు. ఎందుకంటే అవి చిన్న చిన్నగా మొదలై పెద్దదిగా మారి కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తుంది. అందుకే కొన్నింటిని చూసి చూడనట్లు వ్యవహరించాలి.

బాహుబలిని రికార్డ్స్ ను క్రాస్ చేసిన జాతిరత్నాలు..: Jathi Ratnalu movie beats Baahubali records video

‘లెటర్ బాంబ్’ రేపిన దుమారం, ఉద్ధవ్ కి నార్కో టెస్ట్ అవసరం, బీజేపీ డిమాండ్, అనిల్ నివాసం వద్ద నిరసన