AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లెటర్ బాంబ్’ రేపిన దుమారం, ఉద్ధవ్ కి నార్కో టెస్ట్ అవసరం, బీజేపీ డిమాండ్, అనిల్ నివాసం వద్ద నిరసన

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్..సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన 'లెటర్ బాంబ్' పెను ప్రకంపనలు రేపుతోంది. నాగపూర్ లోని అనిల్ నివాసం వద్ద ఆదివారం...

'లెటర్ బాంబ్' రేపిన దుమారం, ఉద్ధవ్ కి  నార్కో టెస్ట్ అవసరం, బీజేపీ డిమాండ్, అనిల్ నివాసం వద్ద నిరసన
Cm Udhdhav Thackeray Must Take Narco Test Says Bjp
Umakanth Rao
| Edited By: |

Updated on: Mar 21, 2021 | 1:08 PM

Share

మహారాష్ట్ర హోం మంత్రి అనిల్ దేశ్ ముఖ్ అవినీతిపై మాజీ సీపీ పరమ్ బీర్ సింగ్..సీఎం ఉధ్ధవ్ థాక్రేకి రాసిన ‘లెటర్ బాంబ్’ పెను ప్రకంపనలు రేపుతోంది. నాగపూర్ లోని అనిల్ నివాసం వద్ద ఆదివారం బీజేపీ యువమోర్చా కార్యకర్తలు నిరసన ప్రకటిస్తూ ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆయన రాజీనామా చేయాలనీ నినాదాలు చేశారు. పుణేలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలతోను, పార్టీ కార్యకర్తలతోను ప్రొటెస్ట్ చేసి అనిల్ రాజీనామా చేయాలన్నారు. సీఎం ఉధ్ధవ్  థాక్రే, హోమ్ మంత్రి  అనిల్ దేశ్ ముఖ్ ఇద్దరూ నార్కో టెస్ట్ జరిపించుకోవాలని, రిజైన్ చేయాలనీ బీజెపీకే చెందిన మరో నేత రామ్ కదమ్ డిమాండ్ చేశారు. ఉధ్ధవ్ నాయకత్వంలో మహారాష్ట్ర, ముంబై పోలీసుల ప్రతిష్ట రెండూ మంట గలిశాయని ఆయన అన్నారు. భారత స్వతంత్ర చరిత్రలో ఇంత దారుణం ఎన్నడూ చూడలేదన్నారు. ముఖ్యమంత్రికి తెలిసే ఈ వ్యవహారమంతా జరిగిందని ఆయన ఆరోపించారు. సచిన్ వాజే గ్యాంగ్ ని ఉద్దవ్ సమర్థించడాన్ని ఈ దేశం, ప్రపంచమంతా చూసిందని రామ్ కదమ్ ఎద్దేవా చేశారు.

శరద్ పవార్ ని, రాహుల్ గాంధీని కూడా ఆయన దుయ్యబట్టారు. శివసేన, పవార్, రాహుల్ తదితరులందరికీ ఈ సొమ్ముల వ్యవహారంలో వాటా ఉందని ఆయన ఆరోపించారు. కానీ ఈ విషయాన్ని మీరు ఎప్పుడు చెబుతారని ప్రశ్నించారు. బీజేపీకే చెందిన మరో నేత కిరిత్ సోమయ్య కూడా మహారాష్ట్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. గత 15 నెలలుగా అధికారంలో ఉన్న ఉధ్ధవ్ ప్రభుత్వం ఇప్పటి వరకు సేకరించిన  1500 కోట్లకు పైగా నిధుల యవ్వారంపై సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సచిన్ వాజే, పరమ్ బీర్ సింగ్, అనిల్ దేశ్ ముఖ్, సీఎం కార్యాలయ అధికారులను  కూడా ఇన్వెస్టిగేట్ చేయాలని కిరిత్ సోమయ్య అన్నారు.

మరిన్ని వీడియోలు చుడండి ఇక్కడ :అమ్మాయికి కాబోయే భర్తకు ఇన్‌స్టాగ్రామ్ లో బెదిరింపులు…కట్ చేస్తే షాకింగ్ నిజాలు…: Man threatens bridegroom video

బద్దలైన అగ్నిపర్వతం వీడియో వైరల్ : The bursting volcano viral video

కూల్ డ్రింక్స్ లో పాము పిల్ల..భయపెడుతున్న వీడియో..!:Snake found in cooldrink bottle Video

ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
5 ఏళ్లలో 1027 శాతం.. రూ. 1 లక్షకు లాభమెంతో తెలిస్తే మైండ్ బ్లాంకే
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
పెళ్లి సింపుల్‌గా..రిసెప్షన్‌ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
JEE Main 2026 అడ్మిక్‌ కార్డుల విడుదల తేదీ ఇదే.. డైరెక్ట్‌ లింక్‌
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?
శరీరంలోని ఈ భాగాలకు బీట్‌రూట్ ఎంత ముఖ్యమో తెలుసా..?