Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Most Liveable City : హైదరాబాద్ పాత, కొత్త సంప్రదాయాల సమ్మేళనం.. దేశంలోనే లివ్ బుల్ సిటీగా ప్రసిద్ధి.. ఆ ప్రాభవం కోల్పోతుందా..!

హైదరాబాద్ అంటే చార్మినార్ లేదా బిర్యానీ మాత్రమే కాదు.. ఈ నగరం సాంప్రదాయ మరియు ఆధునిక సమ్మేళనాల కలయిక. ఇక ఇక్కడ ఎన్నో ఉన్నత విద్యను అందించే సంస్థలఆటో పాటు మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. దీంతో మన దేశంలో ఆకర్షణ చైతన్యం కలిగి నగరం అని ఎవరైనా అంటే.. వెంటనే గుర్తుకొచ్చేది భాగ్యనగరమని చెప్పవచ్చు. ..

Most Liveable City : హైదరాబాద్ పాత, కొత్త సంప్రదాయాల సమ్మేళనం.. దేశంలోనే లివ్ బుల్ సిటీగా ప్రసిద్ధి.. ఆ ప్రాభవం కోల్పోతుందా..!
Most Liveable City Hyd
Follow us
Surya Kala

|

Updated on: Mar 21, 2021 | 2:00 PM

Most Liveable City :  హైదరాబాద్ అంటే పాత, కొత్త సంప్రదాయాల సమ్మేళనం. ఇక్కడ శతాబ్దాల నాటి మినార్లు, గోపురాలు, కట్టడాలు, ఎత్తైన ప్రదేశాలు , ఆకాశ హర్మ్యాలు, ఉద్యానవనాలు, పార్కులు ఇలా ఎన్నో ప్రత్యేకతలు దర్శనమిస్తాయి. ఇక ఫలక్ నుమా, చౌమహల్లా వంటి ప్రపంచం ప్రసిద్ధి గాంచిన ప్యాలెస్ లు, 450 సంవత్సరాల పురాతన గోల్కొండ కోట, ఆసియాలోని పొడవైన ఫ్లై ఓవర్-ఎక్స్‌ప్రెస్‌ వే లతో పాటు అత్యాధునిక విమానాశ్రయం ఉన్నాయి.

ఇక ప్రపంచ ఖ్యాతి గాంచిన సాంప్రదాయ మీఠా పాన్, నాన్ కి రోటీ, హలీం, షీక్ కబాబ్, దోసఎం ఇరానీ చాయ్ వంటివి రోడ్డు సైడ్ న దొరుకుతాయి. ఎంతో రుచికరమైన సుషీ, బక్లావా వంటి అనేక ఆహార పదార్ధాలతో నిండి ఉంది భాగ్యనగరం. ఫైవ్ స్టార్ హోటల్స్ తో పాటు సెవెన్ స్టార్ హోటల్స్ , ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణం చేయడానికి అందుబాటు లో ఉన్న క్యాబ్ లు , ఆటోలు. బిద్రీ, కలంకారీ వంటి అనేక రకాల దుస్తులు, ఫ్యాషన్ దుస్తులు, రకరకాల గాజులు ఇలా అన్నీ లభ్యమవుతాయి.

నిజానికి ఒక నగరం జీవించడానికి అనుకూలమైనది అని లవబుల్ సిటీ అని పిలవాలంటే కొన్ని ప్రాధమిక లక్షణాలు కలిగి ఉండాలి. నగరం కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగి.. స్తానిక పరిస్థితులు, ప్రయాణికులు, వ్యాపారవేత్తలు మరియు ప్రపంచం నలుమూలల నుండి ఆ నగరానికి వచ్చే పెట్టుబడిదారులు. భౌగోళిక స్థానం, సమశీతోష్ణ వాతావరణం, ప్రయాణ సౌలభ్యం, కాస్మోపాలిటన్ సంస్కృతి, ప్రజల జీవన సౌలభ్యం, ఉన్నత విద్య మరియు వైద్య సౌకర్యాలు, పౌర మౌలిక సదుపాయాలు మరియు భద్రత. ఇవన్నీ ఉంటె ఆ నగరాన్ని లివబుల్ సిటీ అని అంటారు. ఈ లక్షణాలతో పాటు దక్షిణ, ఉత్తర భారత దేశాల మధ్య అంటే హైదరాబాద్ భారత దేశానికి నడిబొడ్డున ఉంది.

ఇక కాస్మోపాలిటన్ సంస్కృతికి నెలవు.. గత నాలుగున్నర శతాబ్దాలుగా అభివృద్ధి చెందింది. సున్నితమైన వాతావరణం. ఆతిథ్యం ఇవ్వడంతో అగ్రస్థానం.. ఇవన్నీ కలిసి హైదరాబాద్ ను బ్యూరోక్రసీ నగరంగా నిలబెట్టాయి. ఇక ప్రపంచ ప్రఖ్యాత వంటకాలతో అగ్రస్థానంలో ఉంది. దీంతో భాగ్యనగరాన్ని 2019 లో UNESCO ఆహారపు అలవాట్లలో సృజనాత్మకత కలిగిన నగరంగా గుర్తించింది.

హైదరాబాద్ అంటే చార్మినార్ లేదా బిర్యానీ మాత్రమే కాదు.. ఈ నగరం సాంప్రదాయ మరియు ఆధునిక సమ్మేళనాల కలయిక. ఇక ఇక్కడ ఎన్నో ఉన్నత విద్యను అందించే సంస్థలఆటో పాటు మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇక ఐటీ, ఫార్మా, మెడికల్ వంటి అనేక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుంది. కొన్ని రంగాల్లో హైదరాబాద్ క్యాపిటల్ ఆఫ్ హైదరాబాద్ గా నిలుస్తుంది. దేశానికి పేరు ప్రతిష్టలను తెచ్చిన ఎంతో మంది క్రీడాకారులను అందించిన నగరంగా ప్రసిద్ధి పొందింది. అయితే తాజాగా కొన్ని అధ్యయనాలలో షాకింగ్ వార్త ఇనిపిస్తోంది. హైదరాబాద్ తన ప్రభావాన్ని కోల్పోతుందని.. ఇప్పుడు దేశంలో జీవించదగిన నగరం బిరుదుని కోల్పోయిందని పద్మశ్రీ అవార్డు గ్రహీత, తమిళ సినీ నటుడు మహ్మద్ అలీ బేగ్ చెప్పారు .  ఇది మహ్మద్ అలీ బేగ్ వ్యక్తిగతం అభిప్రాయం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వాణిజ్య రాజధాని , అధిక జనాభా కలిగిన నగరం. దక్షిణాదిన మెట్రో పాలిటన్ సిటీగా ఖ్యాతిగాంచింది. బహుభాషాలు కలిగిన ప్రాంతం.. పని చేయడానికి మరియు నివసించడానికి అనుకూలమైన ప్రదేశం. కళలు మరియు సంస్కృతి, పర్యాటకం, భారీ చిత్ర పరిశ్రమ, థియేటర్స్ , ఉద్యోగావకాశాలు, నివసించడానికి లభించే ఇల్లు ఇవన్నీ కలిసి హైదరాబాద్‌ను ఆదర్శవంతమైన నివసించదగిన నగరంగా మార్చాయి. ‘షీ టీమ్స్’, మత సామరస్యం, జీవన నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ ప్రపంచానికి ఆదర్శవంతమైన నగరంగా నిలిచింది హైదరాబాద్.

Also Read: కన్నతండ్రే కాలయముడయ్యాడు.. నిద్రిస్తున్న కూతురిని అతి దారుణంగా చంపేశాడు.. కారణాలు ఇలా ఉన్నాయి..

ఈ విజయ నా బాధ్యతను మరింత పెంచింది.. ఒక ఐడియాలజీతో ముందుకెళతా.. సురభి వాణీ దేవి ఫస్ట్ కామెంట్స్..