కన్నతండ్రే కాలయముడయ్యాడు.. నిద్రిస్తున్న కూతురిని అతి దారుణంగా చంపేశాడు.. కారణాలు ఇలా ఉన్నాయి..

Father Assassinate Daughter : ఆధునిక సమాజంలో వింత పోకడల వల్ల సొంత కుటుంబ సభ్యుల్లోనే మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరికొకరు చంపుకు

కన్నతండ్రే కాలయముడయ్యాడు.. నిద్రిస్తున్న కూతురిని అతి దారుణంగా చంపేశాడు.. కారణాలు ఇలా ఉన్నాయి..
Father Assassinate Daughte
Follow us
uppula Raju

|

Updated on: Mar 21, 2021 | 1:43 PM

Father Assassinate Daughter : ఆధునిక సమాజంలో వింత పోకడల వల్ల సొంత కుటుంబ సభ్యుల్లోనే మనస్పర్ధలు వస్తున్నాయి. ఒకరికొకరు చంపుకునేంతవరకు దిగజారుతున్నారు. రక్త సంబంధాలు మరిచి పశువులా ప్రవర్తిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలోని మధురై సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కూతురు ప్రేమ వ్యవహారం నడుపుతుందని అతి దారుణంగా హత్య చేశాడు ఓ తండ్రి.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

మదురై వండియూరు సంగునగర్‌కు చెందిన ఆశైతంబి ఆటోడ్రైవర్‌గా పనిచేస్తూ ఉంటాడు. అతడికి 26 సంవత్సరాల పెళ్లి ఈడుకొచ్చిన కూతురు ఉంది. ఆమె జైహింద్‌పురం ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నర్సుగా పనిచేస్తోంది. అయితే ఇటీవల ఆమె ప్రవర్తనలో మార్పుగమనించిన తండ్రి అసలు విషయాలను ఆరా తీశాడు. దీంతో అతడికి కూతురు ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం నెరుపుతుందని తెలుసుకున్నాడు. ఆగ్రహంతో ఓ రోజును కూతురిని పిలిచి మందలించాడు.

అయినప్పటికి ఆమె మాట వినకుండా ప్రేమ వ్యవహారం నడిపించేసరికి ఆశైతంబి కోపోద్రిగ్తుడయ్యాడు. తన పరువుకు భంగం కలిగిస్తుందని చంపేయాలని నిర్ణయించుకున్నాడు. రాత్రిపూట ఇంట్లో నిద్రిస్తుండగా చపాతి కర్ర తీసుకొని ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దీంతో ఆ యువతి అక్కడికక్కడే చనిపోయింది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు.

Graduates MLC: ఈ విజయ నా బాధ్యతను మరింత పెంచింది.. ఒక ఐడియాలజీతో ముందుకెళతా.. సురభి వాణీ దేవి ఫస్ట్ కామెంట్స్..

Employees PRC: తెలంగాణ సర్కార్‌ ఉద్యోగులకు తీపి కబురు.. పీఆర్సీపై అధికారిక ప్రకటన చేసే అవకాశం..!

Chittoor District Corona Cases: చిత్తూరు జిల్లాలో కరోనా కల్లోలం.. వణుకు పుట్టిస్తోన్న వైరస్ వ్యాప్తి