Liquor Mafia in AP: ఆంధ్రప్రదేశ్‌లో రూట్ మార్చిన లిక్కర్ మాఫియా.. వారినైతే పోలీసులు పట్టుకోరని భావించి..

Liquor Mafia in AP: ఏపీలో మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో లిక్కర్ మాఫియా రూట్ మార్చింది. ఎన్ని రకాలుగా..

Liquor Mafia in AP: ఆంధ్రప్రదేశ్‌లో రూట్ మార్చిన లిక్కర్ మాఫియా.. వారినైతే పోలీసులు పట్టుకోరని భావించి..
Liquor Mafia
Follow us

|

Updated on: Mar 21, 2021 | 10:38 AM

Liquor Mafia in AP: ఏపీలో మద్యం అక్రమ రవాణాపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్న నేపథ్యంలో లిక్కర్ మాఫియా రూట్ మార్చింది. ఎన్ని రకాలుగా ప్లాన్లు వేసి మద్యం రవాణా చేస్తున్నా పోలీసులు పసిగడుతుండటంతో.. కొత్త ప్రణాళిక రచించారు. ట్రాన్స్‌జెండర్స్ ద్వారా మద్యం అక్రమ రవాణా చేయిస్తున్నారు. తాజాగా ఏపీలో కర్నూలు జిల్లాలో ఇలాంటి ఘటనే వెలుగు చూసింది. పంచలింగా చెక్‌పోస్ట్ వద్ద స్పెషల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ బ్యూరో సీఐ లక్ష్మీ దుర్గయ్య ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో అలంపూర్ నుంచి కొందరు ట్రాన్స్‌జెండర్లు ఆటోలో వచ్చారు. అయితే ఆటోలో ఉన్న ట్రాన్స్‌జెండర్ల ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండటంతో పోలీసులు చెక్ చేశారు. చిరల దాపున దాచి ఉంచిన మద్యం సీసాలను అధికారులు గుర్తించారు. ట్రాన్స్‌జెండర్లను, ఆటో డ్రైవర్‌ని, ఆటోని స్వాధీనం చేసుకున్నారు. అయితే, ట్రాన్స్‌జెండర్లు అధికారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వారిని వదిలేశారు. ఆటో డ్రైవర్‌ను కర్నూలు తాలూకా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆటో డ్రైవర్‌ను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ సదరు ట్రాన్స్‌జెండర్లు.. మరికొందరితో కలిసి వచ్చి పోలీస్ స్టేషన్‌కు వద్ద నిరసన చేపట్టారు. ఆటో డ్రైవర్ తప్పేమీ లేదని, తమపై కేసు నమోదు చేసి తమను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దాంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎంతకీ వినకపోవడంతో చివరికి వారే సైలెంట్‌‌గా వెళ్లిపోయారు. అయితే, ట్రాన్స్‌జెండర్లను అయితే పోలీసులు అడ్డగించరని భావించే మద్యం మాఫియా ఈ రకమైన ప్రయోగానికి తెరలేపిందని పోలీసులు భావిస్తున్నారు.

Also read:

Trs Party Leaders: స్టేషన్‌ఘన్‌పూర్ టీఆర్ఎస్‌లో తారాస్థాయికి చేరిన విభేదాలు.. ఎమ్మెల్యే రాజయ్యపై సంచలన వ్యాఖ్యలు చేసిన కడియం శ్రీహరి..

Illegal Speed Breakers: అనుమతి లేకుండా స్పీడ్‌ బ్రేకర్లు వేసినందుకు ఆర్మీ స్కూల్‌కి జరిమానా.. ఇది చట్ట విరుద్ధమైన పని..

Petrol Diesel Price Today: స్థిరంగా చమురు ధరలు.. ఏపీ, తెలంగాణ సహా దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఎంత ఉన్నాయంటే..

Latest Articles