Dharmendra Pradhan: ఢిల్లీ యూనివర్శిటీలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం.. పాల్గొననున్న కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్
అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
అక్టోబర్ 1న అందరూ స్వచ్ఛా భారత్ కార్యక్రమం చేపట్టాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ప్రతినెల చివరి ఆదివారం మాన్ కీ బాత్‌లో ప్రసంగించే ప్రధాని.. ఈసారి అక్టోబర్1 న ఉదయం 10 గంటలకు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. అలాగే ఈ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని.. తమ పరిసరాలను శుభ్రం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ప్రధాని పిలుపు మేరకు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు స్వచ్ఛ భారత్‌తో పాల్గొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇదిలా ఉండగా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో నిర్వహించనున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు. అక్టోబర్ 1న ఉదయం 9.30 AM గంటలకు కేంద్రమంత్రితో సహా.. పలువులు అతిథులు యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీలో ఉన్న ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్‌కు చేరుకుంటారు. ఆ తర్వాత 9.55 AM కు అక్కడి నుంచి బయలుదేరుతారు.
అనంతరం 10.00 AM నుంచి 11.00 AM గంటల వరకు డాక్టర్ జీసీ నరంగ్ మార్గ్, అలాగే శ్రేయా మిశ్రా మార్గ్ ప్రాంతాల్లో చేపట్టే స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో పాల్గొననున్నారు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్. ఆ తర్వాత 11.15 AM నిమిషాలకు ఇంటర్నేషనల్ గెస్ట్ హౌస్‌లో టీ విరామం తీసుకొని ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరనున్నారు. స్వచ్ఛ హై సేవ, ఏక్ గంటా, ఏక్ సాథ్ అనే ఈ స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్‌లో కేంద్ర మంత్రితో సహా.. యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ వైస్ ఛాన్సలర్ ప్రొ. బరలాం పానీ, సౌత్ ఢిల్లీ క్యాంపస్ డైరెక్టర్ ప్రకాశ్ సింగ్, అలాగే వివిధ కళాశాలలకు చెందిన ప్రినిపల్స్, టీచర్స్, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొననున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..