AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akasa Air Flight : ముంబై-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు.. వారణాసిలో అత్యవసర ల్యాండింగ్‌.. ఆ తర్వాత..

విమానం ఎగిరిన‌కాసేటి త‌ర్వాత విమానంలో బాంబు ఉన్న‌ట్టు అకాసా ఎయిర్ ఫ్లైట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అత్యవసర హెచ్చరిక కాల్‌ వచ్చింది. దాంతో విమానం అత్యవసర విధానాలను అనుసరించి ప్రత్యేక రన్‌వేపై ల్యాండ్ చేయబడింది. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సుమారు గంటపాటు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ..

Akasa Air Flight : ముంబై-వారణాసి విమానానికి బాంబు బెదిరింపు.. వారణాసిలో అత్యవసర ల్యాండింగ్‌.. ఆ తర్వాత..
Akasa Air Flight
Jyothi Gadda
|

Updated on: Sep 30, 2023 | 10:12 PM

Share

సెప్టెంబర్ 29న ముంబై నుంచి వారణాసి వెళ్తున్న విమానం అత్యవసరంగా ల్యాండింగ్ అయింది. ముంబై-వార‌ణాసి విమానంలో బాంబు ఉన్న‌ట్టు ఫోన్‌కాల్ గుర్తు తెలియని వ్యక్తి నుండి ఫోన్‌ కాల్‌ రావ‌డంతో విమానాన్ని అత్య‌వ‌స‌రంగా వారణాసిలో ల్యాండ్‌చేశారు. ఎయిర్‌లైన్స్‌ భ‌ద్ర‌తా సిబ్బంది విమానాన్ని క్షుణంగా త‌నిఖీ చేశారు. విమానంలో ఎలాంటి బాంబు పేలుడు వ‌స్తువు లేదని నిర్ధారించటంతో సిబ్బంది, ప్రయాణికులు అంతా ఊపిరిపీల్చుకున్నారు. విమానయాన సంస్థ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ముంబై నుంచి వారణాసికి అకాసా ఎయిర్‌లైన్ విమానం 159 మంది ప్రయాణికులు, ఒక చిన్నారి, ఆరుగురు సిబ్బంది సహా 166 మందితో శుక్ర‌వారం సాయంత్రం బ‌య‌లుదేరింది.

విమానం ఎగిరిన‌కాసేటి త‌ర్వాత విమానంలో బాంబు ఉన్న‌ట్టు అకాసా ఎయిర్ ఫ్లైట్ QP 1498కి ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుంచి అత్యవసర హెచ్చరిక కాల్‌ వచ్చింది. దాంతో విమానం అత్యవసర విధానాలను అనుసరించి ప్రత్యేక రన్‌వేపై ల్యాండ్ చేయబడింది. విమానం ల్యాండ్‌ అయిన వెంటనే.. సీఐఎస్ఎఫ్ సిబ్బంది సుమారు గంటపాటు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విమానంలో ఏమీ దొరకలేదు.

అనంతరం వారణాసి ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ పునీత్‌ గుప్తా మాట్లాడుతూ.. ‘అంతా మామూలే.. బాంబు సమాచారం అందగానే ఎయిర్‌పోర్టు అధికారులు పూర్తి జాగ్రత్తలు తీసుకుని విచారణ జరిపి అంతా బాగానే ఉందని తేల్చారు.. భద్రతా తనిఖీల్లో ఎలాంటి అభ్యంతరకరమైన వస్తువులు గానీ, ఎలాంటి పేలుడు పదార్థాలు గానీ కనిపించలేదని వారణాసి ఎయిర్‌పోర్ట్ డైరెక్టర్ పునీత్ గుప్తా తెలిపారు. విమానం సురక్షితంగా ఉన్నట్టు వెల్ల‌డించారు. ఫేక్ ఫోన్‌కాల్‌పై ఎయిర్‌పోర్టు అధికారులు పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకొని ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
ఆ హీరో నన్ను దర్శకుడి కాళ్లకు నమస్కరించామని చెప్పాడు..
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
వైఫై రూటర్‌పై నాణెం ఎందుకు పెడుతున్నారు?.. వైరల్‌ ట్రిక్!
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
అయ్యో అనిత.. డెలివరీ కోసం ఆస్పత్రికి వచ్చింది.. అంతలోనే..
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
ఆ హీరోలు రాస్కెల్స్.. కలిసి సినిమా చేద్దామనుకుంటే ఒప్పుకోలేదు
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
పండుగకు కొత్త స్వీట్ ట్రై చేయాలా?.. రాగి పాయసం రెసిపీ ఇదిగో!
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
ఇన్వెస్టర్లు డబ్బులు రెడీ చేసుకోండి.. లలితా జ్యువెలరీ IPO..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
గుడ్డిగా ఎవరినీ నమ్మకండి.. కొంగను నమ్మిన చేపలకు చివరికి..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
విద్యుత్ లేదు.. మోటార్ లేదు.. అయినా కొండెక్కుతున్న నీరు..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
వారంలో ఈ రోజుల్లో గోర్లు కట్ చేయొద్దట.. కారణమిదే..
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి
గ్రీన్ టీలో ఈ మూడు కలిపి తాగితే డబుల్ బెనిఫిట్స్! బరువు తగ్గి