50 అడుగుల లోయలోపడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌

54 మంది ప్రయాణికులతో బయల్దేరిన టూరిస్టు బస్సు ఊటీకి వచ్చి తిరిగి పట్టణానికి వస్తుండగా ప్రమాదానికి గురైంది. నీలగిరి జిల్లా కున్నార్-మెట్టుపాళయం జాతీయ రహదారి వంతెనపై అదుపు తప్పిన టూరిస్ట్‌ బస్సు 50 అడుగుల ఎత్తు నుంచి లోయలోకి పడిపోయింది. ఈ రోజు సాయంత్రం 5.15 గంటలకు ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది.

50 అడుగుల లోయలోపడ్డ టూరిస్టు బస్సు.. 8 మంది మృతి.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌
Nilgris Bus Accident
Follow us
Jyothi Gadda

|

Updated on: Sep 30, 2023 | 9:41 PM

తమిళనాడు రాష్ట్రం నీలగిరిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కున్నూరు- మెట్టుపాళ్యం జాతీయ రహదారిపై టూరిస్టు అదుపు తప్పి లోయలో పడిపోయింది. మరపాలెం ప్రాంతంలో ఉట్కై పర్యటనకు వెళ్లి తిరిగి వస్తుండగా ప్రైవేట్ బస్సు ప్రమాదానికి గురైంది. జరిగిన ప్రమాదంలో 8 మంది మరణించారు. నీలగిరి జిల్లా పోతలపుటూరు సమీపంలోని కడయం నుంచి బయల్దేరిన పర్యాటకుల బస్సు ప్రమాదానికి గురైంది. 54 మందితో టూరిస్టు బస్సు ఊటీకి వచ్చి తిరిగి పట్టణానికి వస్తుండగా నీలగిరి జిల్లా కున్నార్-మెట్టుపాళయం జాతీయ రహదారి వంతెనపై అదుపు తప్పి 50 అడుగుల లోయలోకి పడిపోయింది. ఈరోజు సాయంత్రం 5.15 గంటలకు ప్రమాదం జరిగినట్టుగా తెలిసింది.

ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడ్డారు. వారిని రక్షించి కున్నార్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 8 మంది మృతి చెందినట్లు సమాచారం. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ పోలీసులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. దీంతో కూనూర్ మెట్టుపాళయం రహదారిపై ట్రాఫిక్ జామ్ అయింది.

ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 8కి చేరింది. పరిస్థితి విషమంగా ఉన్న ఇద్దరికి కూనూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అలాగే, నీలగిరి జిల్లా కలెక్టర్, హైవేస్ డిపార్ట్‌మెంట్ పోలీసులు తదితరులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రక్షించిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ పరిస్థితిలో కూనూర్ ప్రభుత్వాసుపత్రిలో 8 మంది మృతి చెందారు.ఈ ప్రమాదంలో మరణించిన వారిలో నితిన్ (16), బేబికళ (36), మురుగేషన్ (65), ముప్పిడాతి (67), కెలసల్య (29),మరికొందరిని గుర్తించాల్సి ఉందని పోలీసు శాఖ తెలిపింది. అలాగే నలుగురికి తీవ్రగాయాలు కాగా వారికి చికిత్స అందిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..