Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌1.. ఇస్రో కీలక అప్‌డేట్‌

సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్కో ప్రతిష్ఠాత్మకంగా ఆదిత్య- ఎల్ 1 ప్రయోగం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆదిత్య ఎల్-1 మిషన్ తన లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం కీలక అప్‌డేట్‌‌ను అందించింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని పేర్కొంది.

ISRO: భూ గురుత్వాకర్షణ పరిధిని దాటేసి దూసుకెళ్తున్న ఆదిత్య ఎల్‌1.. ఇస్రో కీలక అప్‌డేట్‌
Aditya L1
Follow us
Aravind B

|

Updated on: Sep 30, 2023 | 9:46 PM

సూర్యుడిపై పరిశోధనల కోసం ఇస్కో ప్రతిష్ఠాత్మకంగా ఆదిత్య- ఎల్ 1 ప్రయోగం చేపట్టిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ ఆదిత్య ఎల్-1 మిషన్ తన లక్ష్యం దిశగా దూసుకెళ్తోంది. ఈ ప్రయోగానికి సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) శనివారం కీలక అప్‌డేట్‌‌ను అందించింది. ఈ వ్యౌమనౌక ఇప్పటికే భూమి నుంచి 9.2 లక్షల కిలోమీటర్లకు పైగా దూరం ప్రయాణించిందని పేర్కొంది. అయితే ఈ క్రమంలోనే భూ గురుత్వాకర్షణ పరిధిని కూడా విజయవంతంగా దాటినట్లు పేర్కొంది. ప్రస్తుతం లెగ్రేంజ్‌ పాయింట్‌ 1 దిశగా ఈ ఆదిత్య ఎల్1 వ్యోమనౌక పయనిస్తున్నట్లు పేర్కొంది. అలాగే ఎల్‌ 1 పాయింట్‌ భూమి నుంచి సూర్యుడి దిశగా చూసుకుంటే దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అయితే భూ గురుత్వాకర్షణ పరిధిని దాటిపోయి.. ఓ వ్యోమనౌకను ఇస్రో విజయవంతంగా.. పంపడం ఇది వరసగా రెండవసారని ఇస్రో పేర్కొంది.

అలాగే అంగారకుడిపై పరిశోధనలకు ఉద్దేశించినటువంటి మార్స్‌ ఆర్బిటర్‌ మిషన్‌ మొదటిసారిగా ఈ ఘనతను సాధించినట్లు ఇస్రో వెల్లడించింది. అయితే.. ‘చంద్రయాన్‌-3’ ప్రయోగం విజయవంతమైన తర్వాత ఇస్రో ‘ఆదిత్య ఎల్‌1’ను ప్రయోగించిన సంగతి అందరికీ తెలిసిందే. సెప్టెంబరు 2వ తేదీన ఆదిత్య-ఎల్‌1 శాటిలైట్‌ను తీసుకొని పీఎస్‌ఎల్‌వీ-సి57 వాహకనౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే ఆదిత్య-ఎల్‌1లో చూసుకుంటే మొత్తం ఏడు పేలోడ్లు ఉన్నాయి. మరో విషయం ఏంటంటే ‘లెగ్రేంజ్‌ పాయింట్‌ 1’ వద్ద భూమి, సూర్యుడికి చెందినటువంటి గురుత్వాకర్షణ బలాలు సమానంగా ఉంటాయి. దీంతో ఇక్కడి నుంచి ఉపగ్రహాలు నిరంతరం సూర్యుడిని కనిపెట్టుకోవటానికి వీలుంటుంది. వాస్తవానికి ఆదిత్య ఎల్1 భూమి గురుత్వాకర్షణ శక్తి నుంచి బయటపడిన అనంతరం తగిన వేగం పొందేందుకు పలుమార్లు భూమి చుట్టూ దీర్ఘవృత్తాకారంలో చక్కర్లు కొట్టింది.

ఇవి కూడా చదవండి

అంతేకాదు.. దశల వారీగా కూడా ఆదిత్య ఎల్ 1 అన్ బోర్డ్ ఇంజన్లను మండించి ఇస్రో శాస్త్రవేత్తలు కక్ష్యను మార్చారు. అయితే అనుకున్న వేగం సాధించిన అనంతరం ఎల్1 పాయింట్ వద్దకు ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఇదిలా ఉండగా.. ఇప్పటికే చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో.. అందరి దృష్టి ఇస్రో వైపుకు మళ్లింది. ఆ తర్వాత వెంటనే ఇస్రో సూర్యుని రహస్యాలు తెలుసుకునేందుకు ప్రయోగించిన ఆదిత్య ఎల్ 1సైతం విజయవంతంగా ముందుకు వెళ్తుండటంతో ఇస్రోపై అందరు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.